MAD Movie OTT Release date: కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇదే లిస్ట్ లోకి చేరింది మ్యాడ్ మూవీ. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ టైటిల్ రోల్ లో నటించిన ఈ మూవీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ ద్వారా కల్యాణ్ శంకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో రఘుబాబు, రచ్చరవి, మురళీధర్ గౌడ్ కీలకపాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీలో ఓ క్యామియో రోల్‌లో మెరవడం విశేషం. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్‌ సిసిరిలియో ఈ మూవీకి సంగీతం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని నవంబర్‌ మొదటి వారంలో ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. హ్యాపీ డేస్, జాతిరత్నాలను మిక్స్ చేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. 


Also Read: BB 7 voting: ఓటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో శివాజీ.. పాతాళానికి పడిపోయిన సీరియల్ నటి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి