BB 7 voting: ఓటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో శివాజీ.. పాతాళానికి పడిపోయిన సీరియల్ నటి..

BB 7 updates: తెలుగు బిగ్ బాస్ ఊహించని రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు మేకర్స్. ప్రోమోలు కట్ చేసే విధానం, కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టే విధానంతో ఆడియెన్స లో క్యూరియాసిటీని పెంచేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఎనిమిదో వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 01:01 PM IST
BB 7 voting: ఓటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో శివాజీ.. పాతాళానికి పడిపోయిన సీరియల్ నటి..

Bigg Boss 7 Telugu 8th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు. ఈ వారం కరెక్ట్ నామినేషన్లు పడ్డాయనే చెప్పాలి. ఓటింగ్ కూడా చాలా జోరుగా సాగుతోంది. తాజా ఓటింగ్ ప్రకారం, అత్యధిక ఓట్లతో హీరో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో సింగర్ భోలే ఉండటం విశేషం. నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో స్థానంలో సందీప్, ఏడో స్థానంలో అశ్విని ఉన్నారు.

చివరి స్థానంలో కార్తీక దీపం మోనిత శోభా శెట్టి ఉంది. హౌస్ లో తన మాటలతో, చేష్టలతో చిరాకు తెప్పిస్తున్న శోభాను తమ ఓట్లతో పాతాళానికి తొక్కేశారు ఆడియెన్స్. ఆరో వారమే శోభా వెళ్లిపోవాల్సి ఉంది, కానీ బిగ్ బాస్ టీమ్ ఆమెను కాపాడింది. ఆ వారం శోభాకు బదులు నయని పావనిని బలి చేశారు. ఈవారం కూడా శోభా డేంజర్ జోన్‌లో ఉంది. మరి ఈసారైనా ఆమెను ఎలిమినేట్ చేస్తారా.. ఆమె బదులు ఇంకెవరినైనా బలి చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ శోభా శెట్టి ఎలిమినేట్ అయితే.. గతవారం శివాజీ చెప్పిన పెద్ద చేప ఎలిమినేట్ అవుతుందనే వార్త నిజమవుతుంది. 

Also read: Skanda OTT: ఓటీటీ లవర్స్ కు బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద డిజిటల్ స్ట్రీమింగ్‌ వాయిదా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News