Guntur Kaaram: గుంటూరుకారం బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్... ఆ ఒక్క సెంటిమెంట్ వల్ల!!
Mahesh Babu: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంగా వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అని అప్పుడే ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు…దాని వెనక లాజిక్ ఏందో ఒకసారి చూద్దాం…
Mahesh Babu Sentiment: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ చిత్రం పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మొన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ దుమ్మురేపింది. ఏకంగా ఓ ఆల్‍టైమ్ రికార్డు కూడా సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ ఆదివారం రిలీజ్ కాగా ఈ ట్రైలర్లో మహేశ్ బాబు లుక్, మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక దీంతో 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ స్థాయి వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల (3.9 కోట్లు)కు పైగా వ్యూస్ తెచ్చుకొని ఈ ట్రైలర్ ఆల్‍టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ వివరాలను గుంటూరు కారం మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
ట్రైలర్ ఈ రకమైన సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. కానీ అందుకు కారణం ట్రైలర్ ఒకటే కాదు.. మరో సెంటిమెంట్ కూడా అని చిలక జోస్యం చెబుతున్నారు.
మహేష్ బాబు అభిమానులకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువే. గతంలో కూడా మహేష్ బాబుకి మూడు అక్షరాలు ఉండే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అని నాలుగు అక్షరాలు లేదా రెండు అక్షరాలు ఉంటే ఫ్లాప్ అవుతాయి అని ఒక సెంటిమెంట్ అప్పట్లో చక్కర్లు కొడుతూ ఉండేది. దానికి తగ్గట్టుగానే ఒక్కడు.. పోకిరి ..మురారి.. లాంటివి సూపర్ హిట్ కాగా .. వంశీ.. యువరాజు.. నాని లాంటివి డిజాస్టర్లుగా మిగిలాయి.
ఇక ఇప్పుడు సెంటిమెంట్ విషయానికి వస్తే మహేష్ బాబు కొడితే …అనే డైలాగ్ అంటే చాలంట ఆ సినిమా హిట్ అని అంటున్నారు అభిమానులు. ఈ లాజిక్ నిజమే అని చెప్పడానికి ఒక ఇంస్టాగ్రామ్ వీడియో కూడా తెగ వైరల్ చేస్తున్నారు. 2006లో పోకిరి సినిమాలో మహేష్ బాబు కొడితే అనే ఒక డైలాగ్ అంటారు.. ఆ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2018 లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో కూడా ఇదే డైలాగ్ రిపీట్ చేస్తారు.. ఆ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు 2024లో గుంటూరు కారం చిత్రంలో కూడా ఈ డైలాగ్ ఉంది…’కొడితే.. పెళ్ళాం ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పేస్తావు’ అంటూ ఈ ట్రైలర్లో మహేష్ బాబు చెప్పడం అభిమానుల దగ్గర విజిల్స్ వేయించింది.
ఇక ఈ డైలాగ్ వినిందే మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ అని…అందుకు కారణం ఇదే అని.. ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మరి వీళ్ళ లాజిక్ నిజంగానే నిజమవుతుందేమో తెలియాలి అంటే జనవరి 12 వరకు ఎదురు చూడాలి.
Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook