Music Director Taman is Removed from Guntur Karam: సూపర్‌స్టార్ మహేశ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మిడియాలో  వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ముందు నుంచీ సంగీతం అందించిన తమన్నాను దూరం పెట్టారు. పూర్తి వివరాలు మీ కోసం,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేశ్ బాబు అబిమానులు ఇప్పుడు ఈ సినిమా గురించే వెయిటింగ్. గుంటూరు కారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా కన్పించనున్నాడు. ఇక మహేశ్ సరసన శ్రీలీల, పూజా హెగ్డేలు సందడి చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాను చినబాబు, సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు.  


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చక్కని ఆదరణ పొందుతోంది. ఫస్ట్ గ్లింప్స్‌కు కూడా అద్బుతమైన సంగీతం అందించిన తమన్ హఠాత్తుగా ఈ సినిమా నుంచి వైదొలగాడని తెలుస్తోంది. చిత్ర దర్శకుడు, మహేశ్ బాబే తమన్‌ను తొలగించారనేది సమాచారం. తమన్ సినిమా నుంచి వైదొలగిన విషయంలో అందరూ ఎవరికి తోచినట్టువారు కారణాలు చెబుతున్నారు. కానీ మహేశ్ బాబుతో విబేదాల కారణంగానే తమన్‌ను తప్పించినట్టు ప్రధానంగా విన్పిస్తోంది.


Also Read: Anchor Rashmi Gautam: అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో రష్మీ గౌతమ్ ఫొటోషూట్.. హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్


గుంటూరు కారం సినిమా సంగీతం నుంచి తమన్‌ను తప్పించారు సరే మరి ఆ స్థానంలో ఎవరు సంగీతం సమకూరుస్తారనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే కోలీవుడ్ సంగీత దర్శకులు అనిరుధ్ రవిచంద్రన్, జీవీ ప్రకాష్ కుమార్‌లో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్‌కే ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తమన్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేశాడు. మహేశ్ బాబుతో విబేధాల కారణంగానే తమన్‌ను తప్పించారని వస్తున్న ట్రోలింగ్స్‌పై కౌంటర్ ఇచ్చాడు. కడుపు మంట లక్షణాలుండేవాళ్లే ఇలా పుకార్లు రేపుతారని మండిపడ్డారు. 


ఇంతకీ గుంటూరు కారం సినిమా నుంచి తమన్‌ను తొలగించారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మహేశ్ బాబుతో తమన్‌కు విభేదాల విషయంపై తమన్ స్పష్టత ఇచ్చేశాడు. మరి గుంటూరు కారంకు హాట్ హాట్ మ్యూజిక్ బీట్స్ ఎవరిస్తారో చూడాలి. 


Also Read: Raashii Khanna: రాశి ఖన్నా అందాల మైమరిపించే మెరుపులు.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ పిక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి