Major movie first look released: 26/11 ముంబై తీవ్రవాద దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ ( Major ) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ ( Adivi Sesh ) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దీనికి గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ రోజు అడవి శేష్ ( Adivi Sesh Birthday ) జన్మదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మహేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మహేష్ బాబు ( Mahesh Babu ).. అడవి శేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అడవి శేష్ కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లలో మేజర్ చిత్రం ఒకటిగా నిలుస్తుందంటూ మహేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పలు భాషల్లో విడుదలైన మేజర్ పోస్టర్ అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. Also read: Vaani Kapoor: వాణి కపూర్ అందానికి.. ఫిదా కావాల్సిందే


ఈ చిత్రంలో హీరోయిన్లుగా శోభితా దూళిపాళ్ల, సైయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. వీరితోపాటు ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మేజర్ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook