Pramalu Telugu: ఈ సంవత్సరం మొదట్లో ఎటువంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళీ సినిమా ప్రేమలు.
సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకునింది ఈ చిత్రం. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథాశంతో తెరకెక్కిన ‘ప్రేమలు’ సినిమా స్టోరీ.. అందులోని నటీనటుల పర్ఫామెన్స్ మలయాళీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలను ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు అనే విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులోకి సైతం డబ్బింగ్ చేసి విడుదల చేయమన్నాడు. తాజాగా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టగా.. తానే ఈ ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. 


ఈ సినిమాని తెలుగులో మార్చి 8న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మేకర్స్ హైదరాబాద్‌లోని VNR VJIETలో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


ట్రైలర్‌ విషయానికి వస్తే నీ ట్రైలర్ హైదరాబాద్ ట్రైన్‌లో ప్రయాణిస్తోన్న నెల్సన్, మమిత పాత్రలను చూపించటంతో ప్రారంభమవుతుంది. అలాగే మమిత నిద్రపోతున్న సమయంలో నెల్సన్ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరుస్తారు. అక్కడి నుంచి నెల్సన్, మమిత మనసుని ఎలా గెలుచుకున్నాడనే కథ మొదలవుతుంది. నెల్సన్ పడే కష్టాలు నవ్వును తెప్పిస్తున్నాయి. వీరిద్దరితో పాటు ఇతర పాత్రలను కూడా ట్రైలర్ లో  చూపించారు. కామెడీ, ప్రేమ వంటి అంశాల కలగలిసిన సన్నివేశాలతో సినిమా ఎంతో చక్కగా ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. 


కాగా మమత ఈ సినిమాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. నెల్సన్ ఆమె ప్రేమను పొందాలనుకునే క్రమంలో ఆమె మరొకరితో ప్రేమలో ఉందనే విషయం తెలియగానే ఆ ప్రయాణం ఎటు వెళుతుందోనని ఆత్రుత కూడా ఈ ట్రైలర్ చూస్తే ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఇలా ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ ప్రేమలో చిత్రంపై మరింత అంచనాలను పెంచింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.



భావన స్టూడియోస్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతతన్, శ్యామ్ పుష్కరణ్ వంటి వారు ఈ సినిమాని నిర్మించగా గిరీష్ ఎ.డి, కిరణ్ జోసే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో అల్తాఫ్ సలీం, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter