Manchu Vishnu: మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు మరోసారి మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టాడు. మీడియా వల్లనే సినీ పరిశ్రమ సైడ్ ట్రాక్ పట్టిందని విమర్శించాడు. మంచు వ్యాఖ్యలు కొత్త వివాదం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబంపై ట్రోలింగ్ బాగా ఎక్కువైంది. ఈ ట్రోలింగ్‌పై గతంలో పలు సందర్భాల్లో స్పందించిన మంచు విష్ణు ఈసారి మీడియాను టార్గెట్ చేశారు. మీడియాను వివాదంలో లాగాడు. జిన్నా సినిమా ప్రెస్ మీట్‌లో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి. మీడియా కారణంగానే తెలుగు సినీ పరిశ్రమ సైడ్ ట్రాక్ పట్టిందని విమర్శించాడు.


ఒకప్పుడు సినిమా పరిశ్రమ అంతా ఒకే కుటుంబంలా ఉండేదని..కానీ మీడియా పెరగడం వల్ల చీలిపోయిందని మంచు విష్ణు చెప్పాడు. తనను ట్రోల్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నాడు. రెండు ఐపీ అడ్రస్‌లు లభించాయని..ఒకటి జూబ్లీహిల్స్‌లోని ఓ హీరో ఆఫీస్ కాగా మరొకటి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఉందన్నాడు. ప్రత్యేకంగా ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి తనను ట్రోల్ చేస్తున్నారన్నాడు. అదే విధంగా తనను ట్రోల్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా కేసులు పెడుతున్నానన్నాడు. 


ఆన్‌లైన్ మీడియా అనేది ఓ ప్రమాదకరమైన ఆయుధమని..భవిష్యత్ కోసం ఓ టూల్‌గా లేదా ఆయుధంగా వినియోగించవచ్చని మంచు విష్ణు చెప్పాడు. వాస్తవానికి మా ఎన్నికల్నించే ట్రోలింగ్ పెరిగిందని..ఇటీవల ఇంకాస్త ఎక్కువైందన్నాడు. 


మరోవైపు జిన్నా సినిమా విడుదలపై కూడా స్పష్టత ఇచ్చాడు. అక్టోబర్ 5నే విడుదల చేయాలని అనుకోలేదన్నాడు. అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ ఉంటుందని..21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చెప్పాడు. 


Also read: Prabhas Photos at Mogaltur: మొగల్తూరులో జనసందోహం.. కృష్ణంరాజు సంతాప సభ కోసం కదలివచ్చిన అభిమానులు-ఫోటోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook