Chiranjeevi: నాని నిర్మాణంలో చిరంజీవి .. మెగాస్టార్ కెరియర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం!
Chiranjeevi-Nani: చిరంజీవి కం బ్యాక్ ఇచ్చిన తర్వాత..ఇప్పటివరకు చెప్పుకోదగిన విజయం అందుకోలేక పోయారు. వాల్తేరు వీరయ్య మినహా చిరంజీవికి.. సూపర్ హిట్ అయితే రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు.. చిరంజీవి ఏకంగా హీరో నానితో చేయి కలిపి.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Chiranjeevi -Odela: గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా గురించి..ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చిరు నటిస్తారని గాసిప్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్త అధికారికంగా వెలువడింది. ఈ ప్రాజెక్టును నాని సమర్పణలో, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్.. మెగా అభిమానుల్లో తెగ ఆనందాన్ని తెప్పించింది. పోస్టర్‌లో చిరంజీవి రక్తం కారుతున్న చెయ్యి కనిపిస్తోంది. "అతను తన ప్రశాంతతను వైలెన్స్‌లో వెతుక్కుంటాడు" అనే వాక్యంతో ఈ సినిమా చిరు కెరీర్‌లోనే అత్యంత మాస్ యాక్షన్ సినిమాగా రానుంది అని చెప్పకనే చెప్పేశారు. ఈ ప్రకటనతో అభిమానుల.. అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ సినిమా ప్రకటించడంతో నాని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. "నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయన సినిమాల టికెట్లు కోసం లైన్లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన సినిమాని నిర్మించడం ఒక గర్వకారణం," అని తెలిపారు. "మెగాస్టార్ మ్యాడ్‌నెస్ త్వరలో అందరికి అందుబాటులోకి రాబోతుంది," అని శ్రీకాంత్ దర్శకత్వంపై నాని విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, "ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను," అని మెగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమాను నాని "యునానిమస్ ప్రొడక్షన్స్" బ్యానర్‌లో సమర్పించగా, సుధాకర్ చెరుకూరి "SLV సినిమాస్"లో నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో "ప్యారడైజ్" సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరు సినిమా ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత.. నాని నిర్మించే చిత్రం మొదలుకానుండి అని వినికిడి.
Also Read: YS Sharmila: సముద్రంలో పవన్ కల్యాణ్ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి
Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..! .. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.