Mehreen Pirzada Face Acupuncture టాలీవుడ్‌లో మెహ్రీన్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో తప్పా ఇంకెక్కడా కూడా నటించినట్టు అనిపించదు. కనీసం ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ కూడా మారవు. నటించడం పక్కన పెడితే.. కాస్త అందంగానే ఉండటంతో ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. అది కూడా అనిల్ రావిపూడి, మారుతి వంటి వారు మాత్రమే మెహరీన్‌ను ఆదరిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్ 2, ఎఫ్ ౩, రాజా ది గ్రేట్ అంటూ ఇలా అనిల్ రావిపూడి చాన్సులు ఇచ్చాడు. ఇక మారుతి అయితే మహానుభావుడు, మంచి రోజులొచ్చాయ్ అంటూ ఆఫర్లు ఇచ్చాడు. మొత్తానికి మెహ్రీన్ మాత్రం అలా కాలాన్ని నెట్టుకొస్తుంది. ఇక ఆ మధ్య మెహ్రీన్ పెళ్లి వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసింది. కాబోయే భర్త గురించి కూడా చెప్పింది. కానీ చివరకు పెళ్లి మాత్రం పెటాకులైంది. మధ్యలోనే పెళ్లిని బ్రేక్ చేసింది మెహ్రీన్.


 



ఇప్పుడు మెహ్రీన్ మాత్రం తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో మెహ్రీన్‌ ఇలా మొహానికి చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చైనీస్ శాస్త్రియ వైద్య పద్దతైన ఆక్యూపంక్చర్‌ను మెహ్రీన్ ఎంచుకుంది. మ్యాజిక్ విత్ నీడిల్స్.. ఇదో అద్భుతమైన పనితనం.. ఆక్యూస్కిన్ లిఫ్ట్ మెథడ్ అంటూ తను చేయించుకుంటున్న చికిత్స పేరు చెప్పింది. ఈ చికిత్స అయిన తరువాత తాను దుబాయ్ లేదా లండన్‌కు వెళ్లేట్టు కనిపిస్తోంది.


ప్రస్తుతం మెహ్రీన్ చికిత్స మీద మాత్రం పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. మెహ్రీన్‌కు ఏమైంది? ఇందుకు ఇలా చికిత్స తీసుకుంటోందంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మెహ్రీన్ చేతిలో అయితే ఇప్పుడు ఏ ప్రాజెక్టులు లేనట్టుగా కనిపిస్తోంది.


Also Read : Veera Simha Reddy : సెట్‌లో బాలయ్య ఆగ్రహం.. దెబ్బకు డుమ్మా కొట్టేశాడట!


Also Read : Adivi Sesh : HIT 2 ట్విస్టులు లీక్.. హీరోయిన్ అసలు విలన్‌.. అడివి శేష్ ట్వీట్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook