Veera Simha Reddy : సెట్‌లో బాలయ్య ఆగ్రహం.. దెబ్బకు డుమ్మా కొట్టేశాడట!

Nandamuri Balakrishna Fires on Set నందమూరి బాలకృష్ణకు ఉండే ప్రేమ, కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉంటే పసి పిల్లాడిలా ఉంటాడు. కోపం వస్తే మాత్రం అగ్ని పర్వతంలా బద్దలవుతాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 02:53 PM IST
  • సెట్‌లో బాలయ్య చిందులు
  • సెట్ వర్కర్‌ మీద హీరో ఫైర్
  • షూటింగ్‌కు డుమ్మా కొట్టిన వర్కర్
Veera Simha Reddy : సెట్‌లో బాలయ్య ఆగ్రహం.. దెబ్బకు డుమ్మా కొట్టేశాడట!

Nandamuri Balakrishna Fires on Set : నందమూరి బాలకృష్ణ ఎప్పుడు సీరియస్ అవుతాడు.. ఎప్పుడు కూల్‌గా ఉంటాడు.. ఏ క్షణానికి ఏ మూడ్‌లో ఉంటాడో చెప్పడం కష్టం. ప్రేమ వస్తే చిన్న పిల్లాడి మనస్తత్వం అవుతుంది.. కోపం వస్తే ప్రళయం వచ్చినట్టుగా మారుతాడు. అవతల ఉన్నది ఎవరు అనేది కూడా చూడదు. అందుకే బాలయ్యకు కోపం ఎక్కువే ప్రేమ ఎక్కువే అని అంటారు. తాజాగా బాలయ్య తన సినిమా సెట్‌లో ఒకరి మీద అరిచేశాడట.

అసలే ఇప్పుడు బాలయ్య వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మైత్రికి కత్తి మీద సాములా ఉంటుంది. సంక్రాంతి వంటి సీజన్‌కు ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు చిత్రాలు రిలీజ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ మూవీలను సంక్రాంతి బరిలోకి దించడం వారికి పెద్ద తలనొప్పిగా మారినట్టుంది. బాలయ్య మాత్రం సెట్‌లో అసహనం వ్యక్తం చేస్తోన్నట్టుగా తెలుస్తోంది.

టర్కీ షూటింగ్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని విషయంలో హీరో బాలయ్య అసహనం వ్యక్తం చేశాడనే టాక్ కూడా వచ్చింది. అయితే అది కొద్ది సేపే కంటిన్యూ అయిందని, తరువాత ఫుల్ చిల్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు మరొక గాసిప్ చక్కర్లు కొట్టేస్తోంది. నిన్న లోకేషన్‌లో కాస్ట్యూమ్ వర్కర్ మీద బాలయ్య చిందులు తొక్కారని టాక్ వినిపిస్తోంది. 

నిర్మాతలు లోకేషన్‌లో ఉండటం లేదని, ఆ కోపం అలా అలా బాలయ్య ఓ వర్కర్ మీద చూపించారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో నిర్మాత వస్తే అతనిపై కూడా బాలయ్య కాస్త పరుషంగా మాట్లాడారని సమాచారం. మొత్తానికి ఈ రెండు చిత్రాలను థియేటర్లోకి తెచ్చే సరికి తల ప్రాణం తోకకు వచ్చేలా ఉంది నిర్మాతల పరిస్థితి.

Also Read ; Adivi Sesh : HIT 2 ట్విస్టులు లీక్.. హీరోయిన్ అసలు విలన్‌.. అడివి శేష్ ట్వీట్ వైరల్

Also Read : Ram Charan in New Zealand : RC 15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. రామ్ చరణ్‌, కియారా లుక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News