Adivi Sesh : HIT 2 ట్విస్టులు లీక్.. హీరోయిన్ అసలు విలన్‌.. అడివి శేష్ ట్వీట్ వైరల్

Adivi Sesh on HIT 2 Twist అడివి శేష్ నటించిన హిట్‌ 2 సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో అడివి శేష్, నాని టీం ఫుల్ స్పీడు మీదుంది. తాజాగా అడివి శేష్ తన నెటిజన్లకు రిప్లైలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 01:29 PM IST
  • డిసెంబర్ 2న రాబోతోన్న హిట్‌ 2
  • హిట్‌ 2 ట్విస్టులపై అందరిలోనూ ఆసక్తి
  • నెటిజన్ల ట్వీట్లపై అడివి శేష్ రియాక్షన్స్
Adivi Sesh : HIT 2 ట్విస్టులు లీక్.. హీరోయిన్ అసలు విలన్‌.. అడివి శేష్ ట్వీట్ వైరల్

Adivi Sesh on HIT 2 Twist : నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకుడిగా వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్‌తో చేసిన ఆ చిత్రం బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు సెకండ్ కేస్ అంటూ అడివి శేష్‌తో సినిమాను రెడీ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 2న రాబోతోంది. ప్రమోషన్స్‌ను పీక్స్‌కే చేర్చారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళిని పట్టుకొచ్చారక. అలా హిట్ సెకండ్ కేస్ సినిమా మీద ఇప్పుడు జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

ఒక అమ్మాయి బాడీ అని టీజర్‌లో చూపించారు. అన్ని పార్ట్స్ ముక్కలు ముక్కలు నరికిపెట్టారు. కానీ ట్రైలర్‌లో అసలు నిజాన్ని చూపించాడు. అది ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ కావని, తల, చేతులు, కాళ్లు ఇలా అన్నీ కూడా ఒక్కో అమ్మాయికి చెందినవే ట్విస్ట్‌ను రివీల్ చేశాడు దర్శకుడు. అయితే కోడి బుర్ర ఉన్న ఆ విలన్ ఎవరు? అన్నది మాత్రం క్లారిటీ లేదు.

 

దీంతో జనాలే గెస్ చేయడం మొదలుపెట్టేశారు. ఆ విలన్ ఎవరై ఉంటారు.. హత్యలు ఎందుకు చేసి ఉంటారని గెస్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ అయితే ఇలా ట్వీట్ వేశాడు. తన ఫ్రెండ్ ఈ సినిమాలో ఓ రోల్ చేసిందని, కానిస్టేబుల్‌గా నటించిందని, అసలు విలన్ మీనాక్షి చౌదరి అని, ఆమె హీరోయిన్ కాదు విలన్ అని చెప్పుకొచ్చాడు, దీనిపై అడివి శేష్ స్పందించాడు. సోర్స్.. ట్రస్ట్ మీ బ్రో అంటూ అడివి శేష్ ట్వీట్ వేశాడు. ఇది మేం కూడా ఊహించాం.. ఫస్ట్ కేస్‌లో ఫ్రెండ్, ఇప్పుడు లవర్ విలన్ అంటూ ఇంకొంత మంది నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

 

మరో నెటిజన్ అయితే ఏకంగా నానినే విలన్ చేశాడు. దీంతో అడివి శేష్ షాక్ అయ్యాడు. ఇది ఎప్పుడు అయింది? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఓ ఎమోజీని షేర్ చేశాడు. మొత్తానికి హీరోయినే విలన్ అనే టాక్ ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

Also Read : DJ Tillu Square : సక్సెస్ తలకెక్కిందా?.. డిజే టిల్లు స్క్వేర్ విషయంలో సిద్దు ఏం చేస్తున్నాడు?

Also Read : Ram Charan in New Zealand : RC 15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. రామ్ చరణ్‌, కియారా లుక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News