Mohanlal Malaikottai Vaaliban మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలోనూ మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం మలైకొట్టై వలిబన్. మాలైకొట్టైకి చెందిన యువకుడు అని ఆ టైటిల్ అర్థం. బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్‌ను ఇలా విడుదల చేయడంతో సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి. షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్‌లు జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 18న రాజస్థాన్ లోని జై సల్మెర్ లో ప్రారంభమైన షూటింగ్ ఇంకా అక్కడే కొనసాగుతోంది. 


ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతోందనే దాని మీద ఇప్పటికే  ఎన్నో రూమర్లు వచ్చాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళంతో పాటుగా ఇతర ప్రముఖ భాషలన్నిటిలో విడుదల కానుంది. మధు నీలకందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి పి ఎస్ రఫిక్ స్క్రిప్ట్ వర్క్ అందిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, దీపు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


మోహన్ లాల్ చివరగా మాన్‌స్టర్, 12th మ్యాన్ అనే సినిమాల్లో కనిపించాడు. ఈ రెండు చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఇందులో మోహన్ లాల్ యాక్టింగ్‌ అందరినీ ఆశ్చర్యపరించింది. ఇప్పుడు ఇలా మలైకొట్టై వలిబన్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook