Bigg Boss Telugu 4 latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ గేమ్‌ దగ్గరపడింది. బిగ్ బాస్ 4 తెలుగు షోలో విన్నర్ ఎవరో ప్రకటించే సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 20 ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో ప్రస్తుతం బిగ్ బాస్ ఫాలోవర్స్, షో ఆడియెన్స్ అందరి దృష్టి బిగ్ బాస్ హౌజ్ పైనే ఉంది. బిగ్ బాస్ ఇంటిలో జరుగుతున్న ఆసక్తికరమైన పరిణామాలను ఓ కంట కనిపెడుతూనే.. మరోవైపు బిగ్ బాస్ హౌజ్ బయట సోషల్ మీడియాలో వారి అభిమానులు చేస్తున్న సందడిని గమనిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, గత వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన మోనల్ గజ్జర్ ( Bigg Boss contestant Monal Gajjar ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్ సభ్యులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన దృష్టిలో అఖిల్‌కి ( Bigg boss contestant Akhil ) అభిజీత్‌కి అంతగా తేడా కనిపించలేదన్న మోనాల్ గజ్జర్.. అభిజీత్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది. 


అభిజీత్ ( Bigg Boss contestant Abhijeet ) చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉంటాడని, సభ్యుల పట్ల గౌరవంగా ఉంటాడని మోనల్ గజ్జర్ పేర్కొంది. అయితే, అభిజీత్‌లో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుతూ.. అతడు కొన్నిసార్లు తాను మాత్రమే రైట్ అనుకుంటాడని.. ఆ ఇగోను పక్కనపెడితే అతడిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరని మోనల్ గజ్జర్ వ్యాఖ్యానించింది.  


Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4: ఆమె పట్ల మరింత ఓపెన్ అవుతున్న అభిజీత్


మరోవైపు బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం ఉన్న అఖిల్, అభిజీత్, దేత్తడి హారిక ( Dethadi Harika), అరియానా గ్లోరి ( Ariyana Glory ), సోహెల్ ( Sohel ) ఎవరికి వారు తమకు తామే పోటీ అన్నట్టు దూసుకుపోతున్నారు. బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్ తామే అవుతామనే ధీమా వాళ్లందరిలోనూ కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 4 ఫైనల్ ఎపిసోడ్ ( Bigg boss 4 Telugu grand finale episode ) పూర్తయితే కానీ అసలు విన్నర్ ఎవరో తేలే అవకాశం లేదు.


Also read : Bigg Boss 4 Telugu: హారికను పెళ్లి చేసుకుంటా : అనివాష్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook