బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో ఈ వీకెండ్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. వీకెండ్ ఎపిసోడ్లో ఎప్పటిలాగే కంటెస్టంట్స్‌తో సరదాగా ముచ్చటించిన కింగ్ అక్కినేని నాగార్జున.. కన్నడ బిగ్ బాస్ హోస్ట్, శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌ని అతిథిగా ఆహ్వానించి బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈ షోకు అతిథిగా వచ్చిన కిచ్చ సుదీప్ సభ్యులు అందరినీ పలు ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలోనే అవినాష్‌ని ఓ ప్రశ్న అడుగుతూ.. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ముగ్గురు గాళ్స్ మోనాల్ గజ్జర్, హారిక, అరియానా గ్లోరిలలో నువ్వు ఎవరితో డేటింగ్‌కి వెళ్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరిని చంపేస్తావు అని అడిగాడు.
కిచ్చ సుదీప్ అడిగిన ప్రశ్నకు మొదట జవాబు చెప్పడానికి కాస్త ఇబ్బందిపడినట్టుగా కనిపించిన అవినాష్.. ఆ తర్వాత ఏ మాత్రం తడుముకోకుండా తన జవాబు చెప్పేశాడు.
తనకు ఎవిక్షన్ పాస్ వచ్చేందుకు కారణమైన హారికను పెళ్లి చేసుకుంటానని, మోనాల్ గజ్జర్‌తో డేటింగ్‌కి వెళ్తానని చెప్పేసిన అవినాష్ ( Jabardasth comedian Avinash ) .
ఇక అరియానా గ్లోరి వంతు వచ్చేటప్పటికి.. ఆమెను చంపేస్తానని చెప్పిన బిగ్ బాస్ కంటెస్టంట్ అవినాష్.
అవినాష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటని సుదీప్ అడగ్గా.. '' హారిక తన వెంట ఉంటే లైఫ్‌లో ఏదైనా సాధించగలననే నమ్మకం ఉందన్నాడు.
ఇక అరియానా గ్లోరిని చంపుతా అనడానికి కారణం.. ఆమె తనను మానసికంగా వేధిస్తోందని, టార్చర్ పెడుతోందని చెప్పుకొచ్చాడు.
Next Gallery