Mosagallu Trailer launched by Chiranjeevi: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోసగాళ్లు మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద Real IT Scam ఆధారంగా తెరకెక్కినట్టుగా చెబుతున్న మోసగాళ్లు మూవీ ట్రైలర్‌ మెగాస్టార్ Chiranjeevi చేతుల మీదుగా విడుదలైంది. దక్షిణాదిన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంతో పాటు దేశవ్యాప్తంగా హిందీ భాషలోనూ Mosagallu movie release కానుంది. Jeffrey Gee Chin డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు విష్ణుకి సోదరి పాత్రలో Actress Kajal Aggarwal నటించింది. బాలీవుడ్ నటుడు Sunil Shetty తొలిసారిగా ఓ డైరెక్ట్ సౌతిండియన్ మూవీకి సైన్ చేసిన సినిమా ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Ram సినిమాకు సైన్ చేసిన Uppena హీరోయిన్ Krithi Shetty remuneration ఎంతో తెలుసా ?


Manchu Vishnu సరసన హిందీ నటి Actress Ruhi Singh జంటగా నటించింది. ఇతర ప్రధాన పాత్రల్లో నవదీప్, నవీన్ చంద్ర నటించారు. Mosagallu movie trailer చూస్తోంటే.. టెక్నాలజీని, మేధస్సును అడ్డం పెట్టుకుని సాగించిన ఒక భారీ ఐటి కుంభకోణం ఆధారంగా కథాంశాన్ని అల్లుకున్నట్టు స్పష్టమవుతోంది. ఆ రియల్ IT Scam ఏంటి ? ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే వివరాలు తెలియాలంటే Mosagallu movie release date వరకు వేచిచూడాల్సిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook