Vishnu Manchu: ఢీ సినిమా సీక్వెల్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు కెరీర్‌ (Vishnu Manchu) ను ఢీ సినిమా ఎలా మలుపు తిప్పిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు విష్ణు - దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla ) కాంబినేష‌న్‌లో 2007లో విడుదలైన ఢీ (Dhee) సినిమా.. అప్పట్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

Last Updated : Nov 23, 2020, 01:08 PM IST
Vishnu Manchu: ఢీ సినిమా సీక్వెల్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్

manchu vishnu, sreenu vaitla combination - D&D Movie: టాలీవుడ్ (Tollywood) హీరో మంచు విష్ణు కెరీర్‌ (Vishnu Manchu) ను ఢీ సినిమా ఎలా మలుపు తిప్పిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు విష్ణు - దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla ) కాంబినేష‌న్‌లో 2007లో విడుదలైన ఢీ (Dhee) సినిమా.. అప్పట్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఢీ సినిమాను ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారంటే.. అది ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఢీ సినిమా సిక్వేల్ ఎప్పుడంటూ.. నెటిజన్స్ కొన్నాళ్లుగా దర్శకుడు శ్రీను వైట్లను, హీరో మంచు విష్ణును అడుగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మంచు విష్ణు జన్మదినం సందర్భంగా ఢీ సినిమా సీక్వేల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేరకు  సోమవారం మంచు విష్ణు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

శ్రీను వైట్ల ‌- మంచు విష్ణు కాంబినేష‌న్‌లో ‘డీ అండ్ డీ’ (DD) డబుల్ డోస్ క్యాప్షన్‌తో ఢీ సినిమా సీక్వెల్‌ రాబోతుంది. ఈ సినిమాకు కూడా ప్రేక్ష‌కులకి డబుల్ డోస్ వినోదం ఖాయం అంటున్నారు విష్ణు అభిమానులు. మ‌హ‌తి సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా తారగణం, తదితర పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. కొన్నెళ్ల తర్వాత ఢీ సినిమా సిక్వెల్ ప్రకటించడం పట్ల సినీ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. Also read: Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News