OTT Movies: అక్టోబర్‌లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇదే
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
OTT Movies: ఓటీటీలు అందుబాటులో వచ్చాక థియేటర్లకు ఆదరణ చాలా వరకూ తగ్గిందనే చెప్పాలి. కేవలం సినిమాలే కాకుండా వివిధ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్‌సిరీస్‌లు కూడా ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అక్టోబర్ నెలలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్ వివరాలు తెలుసుకుందాం.
ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ ముందే ఫిక్స్ అవుతుందంటే ఓటీటీలకు ఉన్న ఆదరణ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. మార్కెట్‌కు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, జీ5, ఆహా వేదికల్లో ఈ నెలలో స్ట్రీమ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇది
నెట్‌ఫ్లిక్స్‌లో...
అక్టోబర్ 1న ఖుషి స్ట్రీమ్ కానుండగా అక్టోబర్ 4వ తేదీన బెచ్‌కమ్ విడుదల కానుంది. ఇక అక్టోబర్ 5న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలవుతుంది. అక్టోబర్ 5న ఖూఫియా స్ట్రీమ్ కానుంది. అక్టోబర్ 5న లూపిన్ పార్ట్ 3 స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 6న బాలెరినా, అక్టోబర్ 9న సాండర్డ్ విత్ మై మదర్ ఇన్ లా వెబ్‌సిరీస్ స్ట్రీమ్ కానుంది. అక్టోబర్ 11న వన్స్ అపాన్ ఎ స్టోర్, బిగ్‌వేప్ స్ట్రీమింగ్ కానున్నాయి.
జియో సినిమాలో..
బెబాక్ హిందీ సినిమా అక్టోబర్ 1న, లయన్స్ గేట్ ప్లే, అక్టోబర్ 6న జాయ్ రైడ్, మింక్స్ సకెండ్ సీజన్, అక్టోబర్ 20న మ్యాగీ మూవర్స్, అక్టోబర్ 27న కబ్‌వెబ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..
అక్టోబర్ 4న హాంటెడ్ మిషన్, అక్టోబర్ 6న లోకి సీజన్ 2, అక్టోబర్ 6న ఇంఫీరియర్ డెకొరేటర్, అక్టోబర్ 13న సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్‌సిరీస్, అక్టోబర్ 16న వన్స్ అపాన్ ఎ స్టూడియో, అక్టోబర్ 25న మాస్టర్ పీస్ స్ట్రీమ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో...
అక్టోబర్ 6వ తేదీన మిస్టర్ ప్రెగ్నెంట్, అక్టోబర్ 6వ తేదగీన ముంబై డైరీస్ సెకండ్ సీజన్, టోటల్లీ కిల్లర్, అక్టోబర్ 11న మిషన్ ఇంపాజిబుల్ పార్ట్ 1, అక్టోబర్ 20న అప్‌లోడ్ మూడవ సీజన్ స్ట్రీమ్ కానున్నాయి.
Also read; Bigg Boss 7 Telugu: నాగార్జునను ప్రశ్నించిన శివాజీ.. శోభాను కడిగేసిన కింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook