Aryan Khan Will get Bail ?or Not?: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుక్ ఖాన్ (Sharuk khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) కేసులో రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. ఇప్పటికీ కోర్టు మూడు సార్లు బెయిల్ ను తిరస్కరించగా.. ఈ రోజు నాలుగో సారి ముంబాయి కోర్టులో (Mumbai Court)ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ జరగనుంది. అయితే.. ఈ సారైనా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా..?? రాదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు షారుక్ అభిమానులే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ (Bollywood) మొత్తం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయం గురించి ఎదురుచూస్తుంది. నాలుగో సారైన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరవుతుందో లేదో చూడాలి.. 


Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. అన్ని రాష్ట్రాలకు కాదండోయ్!


అయితే గత 19 రోజులుగా ఆర్యన్ ఖాన్ ముంబాయిలోని ఆర్ధర్ రోడ్ జైళ్లో (Aadar Jail in Mumbai) ఉంటున్నాడు. ఈనెల 2న ముంబై క్రూయిజ్ షిప్ (Cruise Ship) రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ అతని స్నేహితులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ఆర్యన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ ఇప్పించడం కోసం షారుఖ్ ఖాన్ తరుపు లాయర్లు ముంబై కోర్టులో తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.




అయితే మరో ట్విస్ట్ ఏంటంటే.. ప్రభాకర్‌ సాయిల్‌ (Prabhakar Sail) అనే సాక్షి.. ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించటానికి నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) 25 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకుందని.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే..!


Also Read: Income Tax Notices: రిక్షా కార్మికుడికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook