Aryan Khan Drugs Case: బాలీవుడ్‌లో వివాదం రేపుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు

Aryan Khan Drugs Case: ప్రముఖ నటుడు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హిందీ పరిశ్రమలో వివాదం రేపుతోంది. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. బాలీవుడ్ తీరును ప్రశ్నిస్తున్న ఆ దర్శకుడు ఏమంటున్నాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2021, 06:45 AM IST
  • బాలీవుడ్ లో వివాదం రేపుతున్న ఆర్యన్ ఖాన్ కేసు
  • ఆర్యన్ ఖాన్ కేసులో బాలీవుడ్ పెద్దల మౌనాన్ని ప్రశ్నించిన నిర్మాత సంజయ్ గుప్తా
  • రేపు మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారని ప్రశ్నించిన సంజయ్ గుప్తా
Aryan Khan Drugs Case: బాలీవుడ్‌లో వివాదం రేపుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు

Aryan Khan Drugs Case: ప్రముఖ నటుడు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హిందీ పరిశ్రమలో వివాదం రేపుతోంది. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. బాలీవుడ్ తీరును ప్రశ్నిస్తున్న ఆ దర్శకుడు ఏమంటున్నాడు.

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో(Mumbai Cruise Drugs Case) ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడైన ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో ఉన్నాడు. అక్టోబర్ 2న అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ కోసం విఫలయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ కేసు ఇప్పుడు బాలీవుడ్‌లో వివాదం రేపుతోంది. షారుక్ ఖాన్ కుటుంబానికి  బాలీవుడు ప్రముఖులు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, పూజా బేడీ తదితరులు మద్దతు పలికారు. అదే సమయంలో ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ఈ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.

ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారంలో బాలీవుడ్(Bollywood)తీరును ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో నిశ్శబ్దంగా ఉన్న బాలీవుడ్ పెద్దల్ని ఆయన ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ (Shah Rukh Khan)సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన‌ ప్ర‌తీ విష‌యంలో షారుక్ ముందుంటారు. అలాంటి ఆయన సంక్షోభ ప‌రిస్థితుల్లో ఉంటే..బాలీవుడ్‌ సినీ ప‌రిశ్ర‌మ నిశ్శ‌బ్దంగా ఉండ‌టమంటే దానికంటే అవ‌మాన‌క‌ర‌మైన విష‌యం మ‌రొక‌టి లేదని స్పష్టంగా ట్వీట్ చేశారు. ఈ రోజు షారుక్‌ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండవచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

నిర్మాత సంజయ్ గుప్తా (?Sanjay Gupta)చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది. బాలీవుడ్ పెద్దల మౌనంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. బాలీవుడ్ బాద్‌షాకు మద్దతుగా  నిలిచేందుకు కొంతమంది బాలీవుడ్ పెద్దలు ముందుకు రాకపోవడం వివాదం రేపుతోంది. ఆర్యన్ ఖాన్ కేసు(Aryan Khan Case)బాలీవుడ్‌లో రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Also read: Bheemla Nayak release date: భీమ్లా నాయక్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News