TikTokలో వైరల్ చేస్తున్నారు.. సంతోషంగా ఉంది: శేఖర్ చంద్ర
ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచిపోయింది. అయినా చిన్న సినిమాలకే చేస్తున్నారు. కానీ పేరు మాత్రం పెద్దగానే వచ్చింది. చేసే పని బాగుంటే కచ్చితంగా పేరు వస్తుందంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర.
హైదరాబాద్: సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్‌లో తనదైన ముద్రతో ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వైరల్ అవుతున్న సవారి సినిమాలోని ‘నీ కన్నులు..’ పాట కోటి మందికి పైగా వీక్షించారంటే శేఖర్ చంద్ర టాలెంట్ ఏంటో చెప్పవచ్చు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆ పాటకు గాత్రం అందించాడు. అయితే తన కెరీర్‌లో చిన్న సినిమాలకే పరిమితమైనా, తనదైన హిట్లతో ముందుకు సాగుతున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తాజాగా పని చేసిన వలయం సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానున్న నేపథ్యంలో షేర్ చేసుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!
తన తండ్రి కెమెరామెన్ హరి అనుమోలు. అయితే తనకు మాత్రం మ్యూజిక్ మీద ఆసక్తి ఉందని తండ్రికి చెప్పారు. సినిమాటోగ్రఫీ అయితే ఓకే కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించటం చాలా కష్టమని తన తండ్రి చెప్పిన మాటల్ని గుర్తుకు చేసుకున్నారు. తనకు ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్.రెహమాన్, ఎంఎం కీరవాణిలే స్ఫూర్తి అని చెప్పారు. కెరీర్ సాఫీగా సాగుతున్నా.. పెద్ద సినిమాలకు చేయలేదనే ఫీలింగ్ ఉంది. అయితే పేరు రావాలంటే పెద్ద సినిమాలకే పనిచేయనక్కర్లేదని అభిప్రాయపడ్డారు శేఖర్ చంద్ర. తెలుగు భాషకే తన ప్రాధాన్యమని చెప్పడంతో టాలీవుడ్ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్
ఇటీవల వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘118’ కెరీర్‌లో తాను పని చేసిన పెద్ద సినిమా అని తెలిపారు. అందులోని ‘చందమామే..’ పాట చాలా పెద్ద హిట్ అయిందని, కళ్యాణ్ రామ్ తనను అభినందించడాన్ని మరిచిపోలేనన్నారు. ముఖ్యంగా సవారి సినిమాలోని ‘నీ కన్నులు..’పాటకు టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. టిక్ టాక్ వీడియోలతో తన పాటను ఆదరిస్తోన్న వారికి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ధన్యవాదాలు తెలిపారు. మీ పాట నిజంగా సూపర్ అని, అందుకే సోషల్ మీడియాలో చేస్తున్నామంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Also Read: ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్