Biyyala Paparao: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ పాపారావు బియ్యాల కీలక వ్యాఖ్యలు
Music School Director Comments: గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేసిన బియ్యాల పాపారావు ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారగా తాజాగా జరిగిన విధ్యార్దుల ఆత్మహత్యల గురించి స్పందించారు.
Music School Director Comments on Students Suicide: గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేసిన బియ్యాల పాపారావు ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాని పాపారావు స్వయంగా దర్శకత్వం వహించడమే కాదు నిర్మించారు కూడా.
సీబీఎస్ఈ, ఇంటర్మీడియట్ ఫలితాలు తాజాగా తెలంగాణలో విడుదలైన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తక్కువ మార్కు వచ్చాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలపై బియ్యాల పాపారావు స్పందించారు. పిల్లలు కలల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన తల్లిదండ్రులు టీచర్లు సమాజం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Custody Movie Review: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య హిట్టు కొట్టాడా?
విద్యార్థుల మీద విద్యాపరమైన ఒత్తిడి పెంచేసి వారి ఎదుగుదలకు బ్రేకులు వేస్తున్నారని ఇదే విషయాన్ని మ్యూజిక్ స్కూల్ అనే మల్టీ లింగ్యువల్ సినిమా ద్వారా ఎంటర్టైనింగ్ గా వివరించామని అన్నారు. డ్రామా టీచర్గా నటించిన శర్మన్ జోషి మ్యూజిక్ టీచర్ గా నటించిన శ్రేయ శరణం లొకేషన్ లో తల్లిదండ్రులు టీచర్స్ వల్ల విద్యాపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న కొంతమంది పిల్లలతో కలిసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సంగీత నాటకాన్ని అందించడానికి కష్టపడడమే ఈ మ్యూజిక్ స్కూల్ ప్రధాన కధాంశం.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రస్తుతానికి విజయవంతంగా మంచి షోస్ తో దూసుకుపోతోంది, ఈ సినిమాలో శ్రియ శరన్ తో పాటు శర్మన్ జోషి, గ్రేసీ గోస్వామి, బెంజిమెన్ గిలాని, సుహాసిని మూలే, లీలా సాంశన్, బాక్స్ భార్గవ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు నటించారు. యామిని ఫిలిమ్స్ బ్యానర్ సమర్పణలో తెలుగు హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమాని తమిళంలో డబ్బు చేసి మే 12వ తేదీన రిలీజ్ చేశారు. హిందీలో పివిఆర్ సంస్థ రిలీజ్ చేసిన ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.
Also Read: Anchor Jhansi: ఆ హీరోతో అఫైర్, ఇంటిపై రైడ్స్.. యాంకర్ ఝాన్సీ సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook