Anchor Jhansi: ఆ హీరోతో అఫైర్, ఇంటిపై రైడ్స్.. యాంకర్ ఝాన్సీ సంచలన ఆరోపణలు

Anchor Jhansi affair with a hero: తెలుగు యాంకర్లలో ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అలాంటి ఆమెకు ఒక హీరోతో అఫైర్ ఉందని ప్రచారం జరగగా దానిపై ఆమె స్పందించింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 12, 2023, 05:20 PM IST
Anchor Jhansi: ఆ హీరోతో అఫైర్, ఇంటిపై రైడ్స్.. యాంకర్ ఝాన్సీ సంచలన ఆరోపణలు

Anchor Jhansi Says They said I had an affair with a hero: తెలుగు యాంకర్లలో ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి తరం వారికి ఆమె కేవలం నటిగా మాత్రమే పరిచయం కానీ ఒకప్పుడు తెలుగులో అనేక షోలు కూడా చేస్తూ ఆమె యాంకర్లలో మేటి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

యాంకర్ గా కెరీర్ లో అనేక షోలు చేసిన ఆమె తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు నటుల్లో మంచి స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని యాసల్లో మాట్లాడగల నటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె తన కెరీర్ మొదట్లో జోగి బ్రదర్స్ లో ఒకరిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత ఒక కుమార్తెకు కూడా జన్మనిచ్చాక 2007 సంవత్సరంలో వారు విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకులు వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.

Also Read: Custody Movie Review: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య హిట్టు కొట్టాడా?

జాగా ఒక ఇంటర్వ్యూలో ఝాన్సీ కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తన క్యారెక్టర్ మీద మరక పడే విధంగా అనేక సంచలన ఆరోపణలు చేశారని అసలు ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలు కూడా అప్పట్లో చేశారని అని ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో ఒక వార్తా సంస్థ పోలీసులు తన ఇంటి మీద రైడ్ చేశారని రాస్తే మరో వార్త సంస్థ నాకు ఒక టాప్ హీరోతో అఫైర్ ఉందని రాసిందని ఆమె చెప్పుకొచ్చింది.

ఇవన్నీ చిల్లర వ్యవహారాలని పేర్కొన్న ఆమె వాటి వల్ల తన మానసిక ప్రశాంతత పూర్తిగా దూరమైందని, తన కెరీర్ కూడా నాశనం అవ్వడానికి అవే కారణమని చెప్పుకొచ్చింది. ఇక తన భర్త నుంచి విడాకులు తీసుకున్న ఝాన్సీ ప్రస్తుతానికి నటిగా అనేక సినిమాల్లో నటిస్తోంది. తన కుమార్తె ఆలనా పాలనా చూసుకుంటూ ఆమె పూర్తిస్థాయిలో తన కుమార్తెను పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకుంది. ఆమె భర్త రెండో వివాహం చేసుకున్నా ఝాన్సీ మాత్రం రెండవ వివాహం జోలికి వెళ్లలేదు.  అయితే ఆ మధ్య సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సమయంలో ఝాన్సీ కూడా రెండోసారి వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

Also Read: Divyabharathi Tollywood Entry: సుడిగాలి సుధీర్ కోసం తమిళ భామ.. ఏకంగా దివ్యభారతిని దింపుతున్నారుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x