Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు
Naga Babu Speech నాగబాబు నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉండగా.. జన సైనికులు మాత్రం గోల గోల చేశారు. నాగబాబు ఎంతో శాంతంగా మారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ నానా హంగామా చేశారు.
Ram Charan Birthday Celebration Event మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డ్ (మార్చి 27) సందర్భంగా ఆదివారం నాడు గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. మెగా అభిమానులు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు బుచ్చిబాబు, మెహర్ రమేష్, బాబీ వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక స్పెషల్ గెస్టుగా వచ్చిన నాగబాబు ఇచ్చిన స్పీచు, ఆ టైంలో జనసైనికులు చేసిన హంగామా మామూలుగా వైరల్ అవ్వడం లేదు. ఇక జన సైనికులు ఎంతగా రెచ్చిపోయినా నాగబాబు మాత్రం నవ్వుతూనే వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఈవెంట్‌లో
నాగబాబు మాట్లాడుతూ.. 'మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్‌లకు మొదటి కొడుకు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవి గారు ఎలానో.. మా పిల్లలకు, మా చెల్లెలి పిల్లలకు, పవన్ కళ్యాణ్ పిల్లలకు రామ్ చరణ్ అలాంటి వాడు. వాళ్లకి ఏమైనా సమస్యలు వస్తే.. వాళ్లంతా ముందుంగా రామ్ చరణ్ వద్దకు వెళ్తారు. సలహాలు, సూచనలు తీసుకుంటారు. రామ్ చరణ్ ప్రస్తుతం పూర్తి మెచ్యూర్డ్ పర్సన్‌గా మారాడు.
అదే నాకు రామ్ చరణ్‌లో నచ్చిన విషయం. ఒకప్పుడు కాస్త కోపం, ఆవేశంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎంతో మెచ్యూర్డ్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ వరకు వెళ్లడం, నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ స్టేజ్ మీద రామ్ చరణ్ బొమ్మ కనిపించడం మనందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా.. ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేశాను. దాని ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని అనుకున్నాను. జనం కోసం తన జీవితాన్ని వదిలేసిన నాయకుడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నాకు చేతనైన సాయాన్ని చేస్తున్నాను.
ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ చేస్తే యావరేజ్ అన్నారు. ఆర్థికంగా అప్పట్లో నష్టపోయాను. కానీ ఇప్పుడు అదే సినిమాను అందరూ బాగుందని అంటున్నారు. రెండ్రోజులుగా ఆరెంజ్ సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. అంటే ఒక తరం ముందే ఆ సినిమాను తీశామని అనిపిస్తుంది. అదే సినిమాను ఇప్పుడు తీసి ఉంటే హిట్ అయ్యేది. ఇక్కడ సీఎం సీఎం అని అరిస్తే కాదు.. దమ్ముంటే ఎన్నికల్లో పాల్గొని, జనాలను ఉత్తేజ పరిచి.. ఓట్లు వేయండి' అని అన్నారు.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook