Lakshya First Look | నాగ శౌర్య లక్ష్మ ఫస్ట్‌లుక్ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆధ్యంత్యం యాక్షన్‌తో నిండి ఉంటుంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య ఆర్చర్ అంటే విల్లుకాడుగా కనిపించనున్నాడు. శౌర్య మజిల్స్‌తో ఉన్న లుక్ చూసి సోషల్ మీడియాలో అభిమానులు సంబరపడిపోతున్నారు. పొడవైన జుట్టు, గుబురు గడ్డం, బ్యారెల్ చెస్ట్, రాటుదేలిన కండలతో అచ్చం స్పోర్ట్స్ బాయ్‌ అవతారంలో అదరగొట్టాడు నాగ శౌర్య. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | KGF దర్శకుడితో ప్రభాస్ మూవీ.. త్వరలో అధికారికంగా వెళ్లండి!


నాగ శౌర్య (Naga Shaurya) ఇమేజ్‌ను మార్చి కొత్తగా ఎలివేట్ చిత్రంగా కనిపిస్తోంది లక్ష్య. ఎందుకంటే ఇప్పటి వరకు శౌర్య చేసిన చిత్రాలు రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ చిత్రాలే.  దాంతో పాటు కొన్ని ప్రయోగాలు చేసినా లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేపోయాడు. కానీ ఈసారి మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అది లక్ష్మ (Lakshya Movie) ఫస్ట్‌లుక్‌లోనే కనిపిస్తోంది. 



Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్


లక్ష్య చిత్రానికి ఎంఎం కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందిస్తున్నాడు.  నారాయణ్ దాస్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కేతిక శర్మ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో జగపతిబాబు (Jagapathi Babu) కీలకపాత్రలో నటిస్తున్నాడు. సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook