Nagababu No Reply on Niharika's Divorce: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఆమె జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒక సీనియర్ పోలీసు అధికారి కుమారుడైన జొన్నలగడ్డ చైతన్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కీలకమైన పొజిషన్లో ఉండేవాడు. అయితే వీరు వివాహం జరిగిన తర్వాత నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ప్రచారం ఊపందుకుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత మళ్లీ నిహారిక సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఈ వార్తలు సమసి పోయాయి. అయితే ఇప్పుడు నిహారిక చైతన్య జొన్నలగడ్డ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడమే కాక జొన్నలగడ్డ చైతన్య అయితే ఒక అడుగు ముందుకు వేసి నిహారికతో కలిసి ఉన్న ఫోటోలను, పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. కేవలం తాను నిహారికకి ప్రజెంట్ చేసిన ఒక కుక్క పిల్ల ఫోటో మాత్రమే ఉంచాడు. అయితే నిహారిక మాత్రం అతని అన్ ఫాలో చేసింది గాని పెళ్లి ఫోటోలు అయితే డిలీట్ చేయలేదు.


అయితే సోషల్ మీడియా వీరులు ఈ విషయం మీద రకరకాల విశ్లేషణలు జరుపుతూ, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ తీర్పులు ఇస్తున్నారు. వాస్తవానికి వారిద్దరి మధ్య ఏం జరిగిందో వారిద్దరికే తెలుసు కానీ సోషల్ మీడియాలో మాత్రం విడాకులు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే సోషల్ మీడియాలో జరిగే అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉండే నాగబాబు ఈ విషయం మీద మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.


ఒకవేళ నిజంగా వారి మధ్య ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఈ పాటికి ఆయన చాలా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చేవారని ఆయన సైలెన్స్ చూస్తుంటే ఏదో జరగరానిది జరిగిపోయిందని మెగా కుటుంబాన్ని అభిమానించే వారు అందరూ బాధపడుతున్నారు. అయితే తాజాగా జనసేన నాయకులు ఒకరు చనిపోవడంతో ఆయన గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.


నాకు ఎంతో ఆప్తులు జనసేన నాయకులు అంతకుమించి వీరాభిమాని ఆయన నానాజీ గారి అకాల మరణం నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆయన ఫోటో సైతం నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. జనసేన అధినేత పవన్ సైతం ఇదేవిధంగా ఆయన మృతి నేపథ్యంలో సంతాప సందేశాన్ని వెలువరించారు. కుమార్తె విడాకుల వార్తలు నేపథ్యంలో నాగబాబు స్పందించకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంటుంది.


Also Read: Shilpa Shetty Akshay Kumar Break Up: శిల్పాశెట్టిని చీట్ చేసిన అక్షయ్ కుమార్‌..ప్రేమిస్తూనే అలా?


Also Read: Kajal Aggarwal in NBK 108: ఎన్బీకే 108లో కాజల్.. ఆ మాటే నిజమైందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook