Nagarjuna on hosting Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌ హోస్ట్ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు నాగార్జున. తెలుగులో బిగ్ బాస్ 5వ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన నాగ్.. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఎంతో ఎంటర్‌టైన్ చేస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అందరినీ అలరించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా చాలా మంది ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని, వారికి ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆడియెన్స్ ముందుకు వస్తోందని నాగ్ (Bigg Boss Telugu season 5 host Nagarjuna) అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ఆర్టిస్టుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే బిగ్ బాస్ కంటెస్టంట్స్ (List of contestants in Bigg Boss Telugu season 5) మనసులోని భావాలను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నానని, ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో సరికొత్త టాస్కులతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తానని నాగ్ తన అభిమానులకు, బిగ్ బాస్ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చాడు. 


Also read : Laabam movie trailer: లాభం మూవీ ట్రైలర్.. మరోసారి జగ్గూ భాయ్ విలనిజం


ఎండెమొల్ షైన్ గ్రూప్ డిజైన్ చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు దేశంలో 7 భాషల్లో 37 సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో 5వ సీజన్ (Bigg Boss Telugu season 5 latest updates) 15 వారాల పాటు కొనసాగనుంది.


Also read : Sidharth Shukla cremation: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి, దుఖసాగరంలో షెహనాజ్ గిల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook