Unstoppable with NBK Season 2 Episode 2 Promo : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్‌తో దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. రెండో సీజన్ మీద మరింత దృష్టి పెట్టేశారు. ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ను నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్‌లతో చేశారు. ఇది ఎక్కువగా పొలిటికల్ ఎపిసోడ్ అయింది. అంత మజా అయితే ఇవ్వలేదు. కానీ నందమూరి, నారా అభిమానులకు మాత్రం మంచి కిక్కిచ్చినట్టు అయింది. ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్‌ ప్రోమో బయటకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రోమోలో సిద్దు జొన్నలగడ్డలు, విశ్వక్ సేన్‌లు వచ్చారు. ఆ తరువాత నిర్మాత నాగవంశీ కూడా వచ్చాడు. అయితే ఈ ముగ్గురితో బాలయ్య ఆడేసుకున్నాడు. విశ్వక్.. మాస్ కా దాస్.. సిద్దు యాస్ కా మాస్.. కానీ మీరు ఎవరితో ఉన్నారో తెలుసా? గాడ్ ఆఫ్ మాస్ అని బాలయ్య తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇక మరో సందర్భంగా హీరోయిన్ల గురించి ముచ్చటించారు. నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని సిద్దుని అడిగాడు బాలయ్య.


 



కియారా అద్వాణి అంటే క్రష్‌ అని సిద్దు చెప్పుకొచ్చాడు. మరి మీకు సర్ అని తిరిగి బాలయ్యను ప్రశ్నించారు. రష్మిక మందన అని బాలయ్య టక్కున చెప్పేశాడు. అంటే బాలయ్యను రష్మిక పడగొట్టేసిందన్న మాట. భవిష్యత్తులో రష్మికకు బాలయ్య చాన్స్ ఇస్తాడా? అన్నది చూడాలి. అసలే రష్మికకు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఉంది. బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇక పుష్ప దెబ్బకు మరింతగా క్రేజ్ పెరిగింది.


పుష్ప సినిమా, అందులోని పాటలు, పాటల్లో రష్మిక వేసిన స్టెప్పులు, సామీ సామీ అంటూ రష్మిక ఊపిన ఊపుడుకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పటికీ రష్మికను శ్రీవల్లిగానే గుర్తిస్తున్నారు. సామీ సామీ స్టెప్పులు వేయమని అడుగుతూనే ఉంటారు. అలా రష్మికకు బాలయ్య కూడా ఫిదా అయినట్టు కనిపిస్తోంది.


Also Read : Kantara Telugu Movie Collections : ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్.. ఫస్ట్ డే ఎంతంటే?


Also Read : Theatres Seating Capacity : ఇండియాలోని అతి పెద్ద థియేటర్లు ఇవే.. హైద్రాబాద్‌లోనే హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ.. లిస్ట్ ఇదే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook