Hyderabad Theatres Seating Capacity : ఒక్కో థియేటర్ ఒక్కోలా ఉంటుంది. కొన్ని థియేటర్లో సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. డాల్బీ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూసే ఎక్స్‌పీరియెన్స్ ఇంకోలా ఉంటుంది. అయితే సీటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండే థియేటర్ల సంఖ్య మాత్రం హైద్రాబాద్‌లోనే ఉంది. మామూలుగా అయితే 500 నుంచి వెయ్యి సీట్లుండే థియేటర్ల కోకోల్లలుగా ఉన్నాయి. కానీ వెయ్యికి పైగా సీట్లుండే థియేటర్లు భారీ థియేటర్ల లిస్ట్‌లోకి వెళ్తుంటాయి.
పశ్చిమబెంగాల్‌లోని అసోన్‌సోల్ సిటీలోని మనోజ్ టాకీస్ హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ ఉంది. 1626 సీట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తరువాత మన హైద్రాబాద్ థియేటర్లే ముందుస్థానంలో ఉంటాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. సంధ్య 70 ఎంఎం (Sandhya 70mm) థియేటర్లో - 1323 సీట్లు, దేవీ 70 ఎంఎం (Devi 70mm) - 1306 సీట్లు, సుదర్శన్ 35 ఎంఎం (Sudershan 35mm) - 1216 సీట్లు, సప్తగిరి 70 ఎంఎం (Saptagiri 70 mm) - 1150 సీట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇక హైద్రాబాద్‌లోని విశ్వనాథ్ థియేటర్లో 1177 సీట్లు, శ్రీరాములు థియేటర్లో 1152 సీట్లు ఉంటాయి. రాజమౌళి అయితే ఎప్పుడూ కూడా శ్రీరాములు థియేటర్లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతుంటాడు. హైద్రాబాద్‌లోని రంగ థియేటర్లో 1306, భుజంగలో 1292 సీట్లు, సంధ్య 35 ఎంఎం 1055, సాయి రంగలో 1055 సీట్లున్నాయి.
చెన్నైలోని ఉడ్ లాండ్స్ థియేటర్లో 1297 సీట్లు, కొచ్చిలోని సరితలో 1177 సీట్లు, కొల్‌కత్తాలోని సోనాలి సినిమాలో 1165 సీట్లు, ముంబైలోని మరాఠ మందిర్‌లో 1148 సీట్లు, జైపూర్‌లోని రాజ్ మందిర్ థియేటర్లో 1145 సీట్లు, ముంబైలోని రేగల్ సినిమాలో 1137, సీట్స్ లిబర్టీలో 1120 సీట్లు, కొచ్చిలోని కవిత థియేటర్లో 1099 సీట్లు, బెంగళూరులోని ఊర్వశీలో 1098, కావేరిలో 1088, ఢిల్లీలోని అంబా సినిమాలో 1084 సీట్లున్నాయి.
బెంగళూరులోని సంపిగెలో 1080, లక్ష్మీలో 1053 సీట్లు ఉన్నాయి. చెన్నైలోని దేవీ పారడైజ్‌లో 1047, కాలికట్‌లోని అప్సరలో 1023 సీట్లు, కలకత్తాలోని భానుశ్రీ సినిమాలో 1020 సీట్లు, విశాఖపట్నంలోని జగదాంబలో 1016 సీట్లున్నాయి. ఇలా మొత్తంగా దేశంలోని హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్ల లిస్టులో మన హైద్రాబాద్ థియేటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
Also Read : Kantara Telugu Movie Collections : ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్.. ఫస్ట్ డే ఎంతంటే?
Also Read : Salaar Update : పృథ్వీరాజ్ భయంకరమైన లుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook