Bimbisara Trailer: కల్యాణ్‌రామ్ నట విశ్వరూపం.. బింబిసార ట్రైలర్ అద్భుతం!
Bimbisara Trailer: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ చిత్రం `బింబిసార`. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Bimbisara Trailer: హీరో కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటిస్తున్న తాజా చిత్రం ‘'బింబిసార’ (Bimbisara)'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ సినిమాతో వశిష్ట అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఫీస్ట్ లాగా కనిపిస్తుంది. ''మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న.. ఓ మహా చక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి'' అంటూ ట్రైలర్ మెుదలవుతుంది. బింబిసారుడిగా కల్యాణ్‌రామ్ విశ్వరూపం ప్రదర్శించడనే చెప్పాలి. ఆద్యంతం ఆకట్టుకునే విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ ఘట్టాలు, పవర్ పుల్ డైలాగ్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ఓ నిధి కోసం హీరో, విలన్ మధ్య సాగే పోరుగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. మెుత్తంగా ఈ ట్రైలర్ ఊహించిన దాని కంటే బాగా ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేసింది.
Also Read; God Father First Look: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే న్యూస్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook