Taraka Ratna Dasha Dina Karma News: కొన్నాళ్ల క్రితం కార్డియాక్ అరెస్ట్ కి గురై మృత్యువాత పడిన తారకరత్న దశ దినకర్మ ఈ రోజు హైదరాబాదులో జరిగింది. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య శ్రేయోభిలాషుల బాధా తప్త హృదయాల మధ్య సాంప్రదాయబద్దంగా ఈ వ్యవహారం ముగిసింది.  అయితే ఈ దశదినకర్మకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ పోస్టర్లో తారకరత్న తల్లిదండ్రుల పేర్లు అంటే మోహనకృష్ణ -శాంతి దంపతుల పేర్లు లేకపోవడంతో వారు ఈ కార్యక్రమానికి రాకపోవచ్చునే ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ చిన్న కర్మ కూడా తండ్రి చేతుల మీదనే జరగడం చితికి ఆయనే నిప్పంటించడంతో పెద్దకర్మ కూడా తండ్రి స్వయంగా తన చేతుల మీదనే జరిపించారు. హైదరాబాదులో ఉన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఈ తతంగం అంతా ముగిసింది. ఇక ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ విజయసాయిరెడ్డి సారథ్యం వహించగా నారా చంద్రబాబు నాయుడు సహా కుటుంబ సభ్యులందరూ హాజరై అలేఖ్య రెడ్డి ఆమె పిల్లలకు తామున్నాము అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.


నందమూరి తారకరత్న భార్యతో ఆయన పిల్లలతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలేఖ్య రెడ్డికి తాను ఉన్నానని అభయం ఇవ్వటమే కాదు అలేఖ్య రెడ్డి తారక్ దంపతుల పెద్ద కుమార్తె నిష్కతో కూడా చంద్రబాబు పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. అన్ని విషయాల్లో ఒక పెద్దగా తాను ఉంటానని ఎలాంటి అవసరం ఉన్నా తనని వెంటనే సంప్రదించాలని పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.


ఇప్పటికే నిష్కకు బాలకృష్ణతో తన తండ్రి కారణంగా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎలాంటి అవసరం ఉన్నా మేము ఉన్నామనే భయం ఇవ్వడంతో కాస్త వారు కుదుట పడే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇక తారకరత్న మరణాన్ని తలుచుకుంటూ ఆమె ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇటీవలే తారకరత్నతో దిగిన చివరి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అమ్మా బంగారు అనే నీ పిలుపు ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఇదంతా ఒక కల అయితే బాగుండు ఆ పిలుపు విని లేస్తాను అన్నట్లుగా అలేఖ్య రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది.


Also Read: Rajamouli Attack: ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్న రాజమౌళి.. అసలు ఏమైందంటే?


Also Read: SS Rajamouli on Jr NTR: ఎన్టీఆర్‌ను చూసి 'ఓరి దేవుడా.. వీడు దొరికాడేంట్రా' అనుకున్నా.. కుంటి గుర్రంతో పోల్చిన రాజమౌళి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి