Nandini Reddy Comments on Controversial Interview:కేజిఎఫ్ సినిమా మీద దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. టాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ యూట్యూబ్ ఛానల్ లో దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి నందిని రెడ్డి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. కేజిఎఫ్ సినిమాలో యష్ క్యారెక్టర్ గురించి వెంకటేష్ మహా చేసిన నీచ్ కమీన్ కుత్తే అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే గాక కన్నడ సినీ అభిమానులకు సైతం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో వెంకటేష్ మహాని దారుణంగా ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున టార్గెట్ చేసి దారుణంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం వెంకటేష్ మహా మాత్రమే కాదు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతర  దర్శకుల మీద కూడా దారుణమైన ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా వారందరూ క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ లు విడుదల చేశారు. నందిని రెడ్డి కూడా తన ట్విట్టర్ వేదికగా తప్పయితే క్షమించాలని కోరారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం మీద నందిని రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


కేజిఎఫ్ పై దర్శకుడు మహా చేసిన కామెంట్లను ఇంటర్వ్యూ వీడియోలో చాలా భాగం ఎడిట్ చేసి అప్లోడ్ చేశారని, అసలు మొత్తం వీడియో పెడితే అసలు నేను ఎలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది లేదా మాట్లాడాల్సి వచ్చింది అనేది తెలుస్తోంది అని పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అలా ఎడిట్ చేసి పెట్టడం సరైన పద్ధతి కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ కామెంట్లకు ముందు దాదాపు పావుగంట నుంచి అరగంట ఫుటేజ్ ఎడిట్ చేశారని, లేదు అంటే అసలు ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా తెలిసేదని ఆమె అన్నారు.


నిజానికి వెంకటేష్ మహా చేసిన కామెంట్లను కొంతమంది సమర్థిస్తున్నారు. నిజమే కదా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు వాలిడ్ అయినా సరే మాట్లాడే విధానం కరెక్ట్ కాదని మరి కొంతమంది అంటున్నారు. ఒక సినీ పరిశ్రమలో ఉండి సినీ పరిశ్రమలో వచ్చిన మరో సినిమాని ఇలా దారుణంగా కామెంట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని వారు అంటున్నారు.
Also Read: Vedhika Photos: హద్దులు దాటేస్తున్న వేదిక అందాల ఆరబోత.. సెగలు రేపేస్తోందిగా!


Also Read: Mrunal Thakur Photos: జక్కన్న చెక్కిన శిల్పానివా మృణాల్ ఠాకూర్..శిల్పాల మధ్య మెరుస్తోందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి