Nani Dasara Review: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత సినిమా నుంచి విడుదలైన ట్రైలర్లు, టీజర్లు సినిమా మీద మరింత ఆసక్తి పెంచేశాయి. దానికి తోడు నాని హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా మీద కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ పరిశ్రమలకు సంబంధించిన ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించారు. అలాంటి సినిమా ప్రేక్షకుల ముందు వచ్చేసింది. ఆ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం 


దసరా కథ:
ఈ సినిమా కథ అంతా గోదావరిఖని సమీపంలోని వీర్లపల్లి అనే ఒక సింగరేణి గ్రామంలో జరుగుతుంది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల( కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ ఉంటారు చిన్నప్పుడు ధరణికి వెన్నెల మీద ప్రేమ కలుగుతుంది. అయితే ఆ ప్రేమను వ్యక్తం చేసే లోపే సూరి వెన్నెలను ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకుని తన ప్రేమను ఆమె ముందు పెట్టకుండా వారిద్దరూ ప్రేమించుకునేలా చేస్తాడు. పెరిగి పెద్దయిన తర్వాత వెన్నెల అంగన్వాడీ టీచర్ అయితే సూరి, ధరణి మాత్రం సింగరేణి బొగ్గు గనుల నుంచి బయటకు వెళుతున్న బొగ్గుని దొంగతనం చేసే వృత్తిని ఎంచుకుంటారు.


వెన్నెల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయబోతున్న తరుణంలో ఆమెకు సూరితో పెళ్లి చేయడానికి ధరణి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ ఊరి సర్పంచ్ శివన్న(సముద్రఖని) ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో గెలిపించి సూరిని వెన్నెలకిచ్చి వివాహం చేయించాలనుకుంటాడు. శివన్న కొడుకు చిన్ననంబి(షైన్ చాం టాకో) హెచ్చరించిన వినకుండా క్రికెట్ టీంని గెలిపించి సూరిని క్యాషియర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగిన క్రమంలో సూరి వివాహం జరిగిన మొదటి రోజే కన్నుమూస్తాడు.


అనుకోని పరిస్థితుల్లో ధరణి వెన్నెల మెడలో తాళి కట్టాల్సి వస్తుంది. అసలు సూరిని ఎవరు చంపారు? ప్రాణంగా ప్రేమించినా సరే స్నేహితుడి కోసమే వెన్నెలను త్యాగం చేసిన ధరణి ఆమె మెడలోని బలవంతంగా ఎందుకు తాళి కట్టాడు? అసలు ఈ అన్నింటికీ రాజన్న(సాయి కుమార్), శివన్న(సముద్రఖని), చిన్ననంబి(షైన్ చాం టాకో) ధరణి జీవితాన్ని అతలాకుతను చేయాలని చిన్న నంబి ఎందుకనుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:


ఇదేదో కొత్త కథనో లేక అద్భుతాలు సృష్టించగలిగే కథ అనో చెప్పలేం. మనం గతంలో ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ పొలిటికల్ డ్రామాకి ప్రేమ కథను జోడించారు. అయినా సరే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా సినిమాని తీర్చిదిద్దేందుకు శ్రీకాంత్ ఓదెల అండ్ టీం కష్ట పడినట్లు కనిపిస్తోంది. మొదటి భాగం అంతా పాత్రల పరిచయానికి ఆ తర్వాత కథలోకి తీసుకువెళ్లేందుకు డిజైన్ చేసుకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలు పెట్టేలా చేశాడు. ధరణి సూరి చావుకి పగ తీర్చుకోవాలని అనుకోవడం, ఆ తర్వాత జరిగిన కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ప్రేక్షకులకు ఒక రకమైన విందు భోజనంలా అనిపిస్తాయి. ఒకరకంగా పుష్ప సినిమా తర్వాత తెలుగులో ఇలాంటి ‘రా’ సబ్జెక్టు ఉన్న సినిమా రాలేదని చెప్పాలి.


కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కాంతార లాంటి కనెక్టివిటీ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకున్న నాని ఈ సినిమాతో ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్ చేసేశాడు. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకుని మరీ సినిమా చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేరేషన్ పరంగా చాలా స్లోగా అనిపించినా సరే నాని, కీర్తి సురేష్ వంటి వారు తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులందరినీ మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే అవసరం మేరకు పాత్రలు ఉన్నా నటించే స్కోప్ ఉన్న వారికి కూడా చిన్న పాత్రలు ఇచ్చారా? అనిపిస్తుంది. మరీ రొటీన్ అని తీసి పారేయలేము కానీ కొంతవరకు ఊహించగలిగే కథ కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగులో ఈ స్థాయిలో రా అండ్ రస్టిక్ సినిమాలు ఈ మధ్యలో రాలేదని అనడంలో ఎలాంటి సందేహం లేదు.


నటీనటులు:


ఈ సినిమాలో నాని పాత్ర హైలెట్గా నిలుస్తుంది. నాని మునుపెన్నడూ నటించని ఒక డి గ్లామర్ రోల్ లో అది కూడా పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న ఒక అల్లరి చిల్లర కుర్రాడి పాత్రలో ఇమిడిపోయాడు .అసలు ఏమాత్రం నాని ఒక నటుడిగా అనిపించకుండా నిజంగానే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్టుగా రెచ్చిపోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో అయితే నాని ఇలాంటి పాత్ర తనకు మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా నటించి ఆకట్టుకున్నాడు. ఒక్క  మాటలో చెప్పాలంటే నానికి ఈ సినిమా ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఖచ్చితంగా నాని కెరీర్ ని దసరాకి ముందు దసరాకి తర్వాత అనేంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ని తప్ప మరొక హీరోయిన్ ని ఊహించలేమేమో అన్నంతగా కీర్తి సురేష్ పాత్రలో ఒదిగిపోయింది. మలయాళ భామ అయినా సరే పూర్తిస్థాయి తెలంగాణ అమ్మాయి ఏమో అని అనుమానం కలిగించేలా నటించేసింది. ఇక దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రలో ఉన్నంతవరకు మెప్పించాడు, అయితే సాయికుమార్, సముద్ర ఖని వంటి వారికి సరైన పాత్రలు ఇతరులు పడలేదేమో అనిపించింది. ఇక విలన్ గా నటించిన మలయాళ స్టార్ షైన్ చాం టాకో రెచ్చిపోయాడు. ఇక పూర్ణ, ఝాన్సీ, సోనియా, రవితేజ, రియాజ్, కొమరం వంటి వారు తమ పాత్రల పరిధి మేర నటించారు. సముద్రఖని, సాయికుమార్ వంటి నటులను ఇంకాస్త వాడుకుంటే బాగుండేమో అనిపిస్తుంది.


టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే
ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా కొత్త దర్శకుడు అని అనుమానం కూడా కలగకుండా సినిమా మొత్తాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. కొంత ల్యాగ్ అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా సినిమా అయితే ఆకట్టుకునే విధంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగులు బాగా పేలాయి. తెలంగాణ యాసలో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా సినిమా సాగింది. ఇక సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలం అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత అందాన్ని పెంచింది. అలాగే ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ పని తీరు ఆద్యంతం కనిపిస్తూనే ఉంటుంది. ఎడిటింగ్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే మరింత క్రిస్పీగా ఉండేదేమో.


ఓవరాల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
దసరా ఒక రా అండ్ రస్టిక్ తెలుగు సినిమా తెలుగు వారిని మాత్రమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి తెలుగు వారి సత్తా చాటగల దమ్మున్న సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూ/ఏ సర్టిఫికెట్ కాబట్టి పిల్లలతో కష్టం కానీ మిగతా ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వీకెండ్ కి చూసేయొచ్చు.


Rating: ☆☆☆/5


Also Read: Dasara Twitter Review: బాంచత్.. దమ్ము చూపిస్తున్న దసరా.. నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే..?


Also Read: Adipurush Special Poster: శ్రీరామ నవమి స్పెషల్ పోస్టర్ రిలీజ్..సీతా లక్ష్మణ సమేతుడిగా రామ్!



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook