Prabhas Adipurush Sirama Navamani Special Poster: ప్రభాస్ హీరోగా ఆది పురుష్ అనే ఒక అద్భుతమైన దృశ్య కావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణ మహా గాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. స్వయంగా ఆయనే రాసుకుని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టి సిరీస్ సంస్థతో పాటు రెట్రో ఫైల్స్ అనే సంస్థ సహా నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మించిన ఈ సినిమాని ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
Mantron se badhke tera naam
Jai Shri Ramमंत्रों से बढ़के तेरा नाम
जय श्री रामమంత్రం కన్నా గొప్పది నీ నామం
జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage pic.twitter.com/yjUXLb06RJ— T-Series (@TSeries) March 30, 2023
ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే సన్నీ సింగ్, వాత్సల్ సేథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని కరోనా ఉధృతంగా ఉన్న ఆగస్టు 2020 వ సంవత్సరంలో ఒక అఫీషియల్ మోషన్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. తర్వాత షూటింగ్ ఫిబ్రవరి 2021 లో మొదలై నవంబర్ 2021 లోనే పూర్తయింది.
ఆ తర్వాత నుంచి ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ముందే రిలీజ్ అవ్వాల్సింది కానీ 3d లో సినిమాను రిలీజ్ చేసేందుకు మరింత వాయిదా వేస్తూ వస్తున్నారు. అజయ్ అతుల్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 16వ తేదీన విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.
''Mantron se badhke tera naam Jai Shri Ram, मंत्रों से बढ़के तेरा नाम जय श्री राम ,మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్ #JaiShriRam #RamNavmi'' అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ను టీం ట్వీట్ చేసింది. ఆ పోస్టర్ లో రాముడిగా ప్రభాస్ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతుడిగా కనిపిస్తున్నారు. మీరూ చూసేయండి మరి.
Also Read: Dasara Twitter Review: దమ్ము చూపిస్తున్న దసరా... నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే?
Also Read: NTR 30: 'పవన్' ప్రాపర్టీ మీద కన్నేసిన ఎన్టీఆర్.. అసలు సంగతి ఇదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook