Dasara 3 Days Collections: టెన్షన్ రేపుతున్న దసరా వసూళ్లు.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే?
Dasara Day 3 Collections: నాని హీరోగా నటించిన దసరా సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ఆసక్తికరంగా మారాయి, ఆ సినిమా ఎంత వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే
Dasara 3 Days Collections: నాని హీరోగా రూపొందించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 30వ తేదీన తెలుగు సహా పాన్ ఇండియా లెవల్లో సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విషయంలో కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 14 కోట్ల 22 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా రెండో రోజు కేవలం 5 కోట్ల 86 లక్షలకే పరిమితం అయింది. మూడో రోజు ఆరు కోట్ల 73 లక్షలు సాధించిన ఈ సినిమా 26 కోట్ల 81 లక్షల షేర్, 45 కోట్ల 50 లక్షల గ్రాస్ నమోదు చేసింది.
నాని దసరా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన ప్రాంతాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో నాలుగు కోట్ల 11 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 87 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 68 లక్షలు, ఈస్ట్ గోదావరి 28 లక్షలు, వెస్ట్ గోదావరి 16 లక్షలు, గుంటూరు 28 లక్షలు, కృష్ణ 28 లక్షలు, నెల్లూరు 13 లక్షలు వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల 73 లక్షల షేర్, 11 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో మూడు రోజులకు గాను రెండు కోట్ల 90 లక్షలు వసూలు చేస్తే మిగతా ప్రాంతాల్లో కేవలం 95 లక్షలు మాత్రమే వసూలు చేసింది.
ఇక నార్త్ ఇండియాలో కూడా 90 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే ఓవర్సీస్ లో జోరు చూపించిన ఈ సినిమా 6 కోట్ల 70 లక్షల వసూలు చేసింది. అలా మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల 26 లక్షల షేర్, 68 కోట్ల 45 లక్షల గ్రాస్ సాధించింది. ఈ దసరా సినిమాకి ఓవరాల్ గా 48 కోట్ల బిజినెస్ జరగగా 49 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా ఫిక్స్ చేశారు. ఆ లెక్కన ఈ సినిమా ఇంకా 10 కోట్ల 74 లక్షలు వసూలు చేస్తే హిట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా నాని స్నేహితుడిగా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటించాడు. ఇక సముద్రఖని సాయి కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా దర్శకత్వం వహించాడు ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో సినిమానే నేర్పించారు వాస్తవానికి ఈ సినిమా తెలుగులో వర్కౌట్ అయినత బాగా నార్త్ లో కానీ ఫ్యాన్ ఇండియా వైడ్ ఎక్కడా కాని వర్కౌట్ కాలేదు. కన్నడ మార్కెట్ కోసం దీక్షిత్ శెట్టి ని మలయాళ మార్కెట్ కోసం కీర్తి సురేష్ షైన్ చాన్ టాకోని దించారు కానీ అవేవీ వర్కౌట్ అయినట్టుగా కనిపించడం లేదు.
Also Read: Manchu Brothers Fight: మంచు విష్ణు-మనోజ్ గొడవలో ట్విస్ట్.. జనాన్ని బకారాల్ని చేశారు మావా!
Also Read: Costumes Krishna Death: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook