Manchu Brothers Fight: మంచు విష్ణు-మనోజ్ గొడవలో ట్విస్ట్.. జనాన్ని బకారాల్ని చేశారు మావా!

House of Manchus Teaser : తన సోషల్ మీడియా వేదికగా హౌస్ ఆఫ్ మంచుస్ పేరుతో ఒక రియాలిటీ షో చేస్తున్నాం అని చెబుతూ ఒక టీజర్ విడుదల చేశాడు మంచు విష్ణు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 30, 2023, 07:56 PM IST
Manchu Brothers Fight: మంచు విష్ణు-మనోజ్ గొడవలో ట్విస్ట్.. జనాన్ని బకారాల్ని చేశారు మావా!

House of Manchus Teaser Released: కొద్దిరోజుల క్రితం మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ దగ్గర పనిచేస్తున్న సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన మంచు విష్ణు సారధి ఇంట్లో గొడవ పడడానికి ప్రయత్నించినట్లుగా అప్పుడు మంచు మనోజ్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇంకేముంది మంచు వారింట రగడ,పెదరాయుడు కుటుంబంలోనే చిచ్చు లాంటి టైటిల్స్ తో పెద్ద ఎత్తున కథనాలు మీడియాలో ప్రసారమయ్యాయి.

అయితే ఇది ప్రాంక్ అయి ఉండవచ్చని అప్పట్లోనే కొన్ని అంచనాలు వెలువడ్డాయి. అయితే అది ప్రాంక్ అయి ఉండడులే నిజంగానే గొడవ పడి ఉంటారని ఎక్కువ మంది అనుకున్నారు. అయితే ఇక తాజాగా ఈ విషయం మీద మంచు విష్ణు క్లారిటీ ఇచ్చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా హౌస్ ఆఫ్ మంచుస్ పేరుతో ఒక రియాలిటీ షో చేస్తున్నాం అని చెబుతూ ఒక టీజర్ విడుదల చేశాడు.

ఈ టీజర్ లో తాను మంచు మోహన్ బాబు కుమారుడిని అని చెబుతూ గొడవపడిన విజువల్ తో పాటు పలు మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ సైతం ప్రసారం చేశారు. చివరిలో ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ పేర్కొంటూ హౌస్ ఆఫ్ మంచుస్ పేరుతో ఈ రియాలిటీ షో వస్తుందని ప్రకటించారు.

దీంతో అప్పట్లో వారి మధ్య ఏదో గొడవ జరిగిందని భావించిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వాస్తవానికి ఇది ఏదో ఒక రకమైన ప్రాంక్ అయి ఉండవచ్చని ఎందరో భావించారు. దానికి కారణం గతంలో కూడా మంచు మనోజ్ ఇదే విధంగా ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమెడియన్ ధనరాజ్ మీద ప్రాంక్ చేశారు. ఈ అంశాన్ని గుర్తుచేసుకొని అందరూ మంచు ఫ్యామిలీ భలే బకరాలను చేసింది మామ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: Dasara Twitter Review: బాంచత్.. దమ్ము చూపిస్తున్న దసరా.. నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే..?

Also Read: Dasara Review: పాన్ ఇండియా దస'రా'...బంచాత్, ఎట్లయితే గట్లే.. నాని అరాచకం మావా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x