నటుడిగా న్యాచురల్ స్టార్ నానీ ( Natural Star Nani ) ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. నానీ కామెడీ టైమింగ్ అంటే టాలీవుడ్ లో ఇష్టపడేవాళ్ల సంఖ్య ఎక్కువే.  అలా నానీ నటించిన మెప్పించిన సినిమా భలే భలే మగాడివోయ్ ( Bhale Bhale Magadivoy ). మారుతి దర్శకత్వం ( Director Maruthi ) వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని కైవసం చేసుకుంది. తాజాగా భలే భలే మగాడివోయ్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. హీరో నానీ, దర్శకుడు మారుతి ఈ విషయంపై గత కొన్ని రోజుగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Ayodhya City: భూమిపూజ కోసం ముస్తాబైన ఆయోధ్య నగరం..ఫొటోలు


నానీ ( Hero Nani ) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. పైగా కరోనావైరస్ వల్ల సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇలాంటి సమయంలో కమిట్ అయిన సినిమాలకే అధిక ప్రాధన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు పాత సినిమాకు సీక్వెల్ కు నానీ కమిట్ అవుతాడో లేదో అనేది  కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నానీ శ్యాం సింగరాయ్, వి ( Nani Movie V) , టక్ జగదీష్ మూవీస్ లో నటిస్తున్నాడు.



Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది