Naresh and Pavitra Lokesh to Made thier Real life Story: తెలుగు సినీ పరిశ్రమలో పవిత్ర లోకేష్ -నరేష్ మధ్య వ్యవహారం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అది సహజీవనానికి దారి తీసింది. మొదట్లో ఈ విషయం పెద్దగా హాట్ టాపిక్ కాలేదు కానీ నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఈ విషయాన్ని కన్నడ మీడియాలో తొలుత చర్చనీయాంశంగా మారేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె ఈ విషయాన్ని హైలెట్ చేయడంతో నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏం జరుగుతోంది అనే విషయం మీద తెలుగు మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. అయితే కన్నడ మీడియా సంస్థ నిర్వహించిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నానని, సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి మేము నానక్ రామ్ గూడ ఇంట్లోనే ఉంటున్నామని పవిత్ర లోకేష్ వెల్లడించింది. ఆ తర్వాత ఇదంతా తమను బద్నాం చేయడానికి రమ్య రఘుపతి చేస్తున్న కుట్ర అని కూడా పవిత్ర లోకేష్, నరేష్ చెబుతూ వచ్చారు.


తర్వాత మైసూర్లో పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఒక హోటల్ గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రమ్య రఘుపతి మీడియా ముఖంగా వారి మీద దాడి కూడా చేయడానికి ప్రయత్నించింది. ఇక ఆ తర్వాత నుంచి నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు అఫీషియల్ గా కలిసి తిరగడం ప్రారంభించారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియల సందర్భంగా కూడా వీరిద్దరూ జంటగా అక్కడ పనులు పర్యవేక్షించడం పలువురి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.


అదేమిటంటే పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని అంటున్నారు. ఆ సినిమా మరి ఏమిటో కాదని వారి జీవితాలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. అప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమై మూడో భార్యతో కూడా దూరంగా ఉంటున్న నరేష్ మొదటి భర్తకు దూరమై వేరుగా కాపురం ఉంటున్న పవిత్ర లోకేష్ మధ్య అసలు స్నేహబంధం ఎలా మొదలైంది? అది ప్రేమగా ఎలా మారింది? అనే విషయాలను వారు సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.


వాస్తవానికి వీరిద్దరికీ ఉన్న క్రేజ్ వేరు. వీరిద్దరి గురించి ఎలాంటి వార్త వచ్చినా అది చదివేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక వీరి గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమది అపవిత్ర ప్రేమ కాదని అనైతిక సంబంధం అంతకన్నా కాదని తమది ఒక పవిత్రమైన ప్రేమ బంధం అని వీరిద్దరూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమా లేక కేవలం ప్రచారమేనా? అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది. ఇక చివరి సారిగా వీరిద్దరూ ఆలీ ప్రధాన పాత్రలో నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలో కూడా భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన వికృతి అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందించారు.


Also Read: Andrila Sharma: ఇండస్ట్రీలో మరో విషాదం.. 24 ఏళ్ల నటి దుర్మరణం


Also Read: Lingusamy: నువ్ వారియర్ అనే సినిమా తీశావంతే.. వారియర్ కాదు లింగుస్వామీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook