2022 Controversial Heroines సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చల్లో ఉండటం అందరికీ సాధ్యం కాదు. మంచో చెడో గానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చల్లో ఉంటూ.. జనాల నోళ్లలో నానుతూ ఉంటారు కొంత మంది సెలెబ్రిటీలు. అందులో మన తెలుగు సెలెబిట్రీల్లో అనసూయ పేరు ముందుంటుంది. ఇక ఈ ఏడాది సైతం అనసూయ ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక రష్మిక మందన్న, సాయి పల్లవి, నయనతార వంటి టాప్ హీరోయిన్లు సైతం ట్రోలింగ్ బారిన పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక మందన్న అయితే కాంతారా సినిమాను చూడలేదు అని చెప్పడంతో ట్రోలింగ్ మొదలైంది. ఇక ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తన మొదటి ప్రొడక్షన్ కంపెనీ పేరు చెప్పకుండా.. చేతులతో ఓవర్ యాక్షన్ చేస్తూ సైగలు చేయడంపై రిషభ్ శెట్టి కౌంటర్లు వేశాడు. అలా మొత్తానికి రష్మిక మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది. చివరకు రష్మిక తల పొగరు దించాలని కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు అయితే తనను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని, అప్పుడు కాంతారా సినిమా చూడలేదు కాబట్టి చూడలేదు అని చెప్పాను.. చూశాక చాలా బాగుందని టీంకు మెసెజ్ చేశానని రష్మిక చెప్పి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.


ఇక సాయి పల్లవి అయితే విరాట పర్వం సినిమా సమయంలో నక్సలిజం గురించి మాట్లాడుతూ.. ఆవుల అక్రమరవాణా పేరు చెప్పి.. ముస్లింల మీద హిందువులు చేసే దాడి కూడా అలాంటిదే అని, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా అలాంటిదే అని చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి మీద నేషనల్ వైడ్‌గా ట్రోలింగ్ జరిగింది. అనుపమ్ ఖేర్, ప్రణీత వంటి వారు ఆమె మీద సెటైర్లు వేశారు. ఇక వివాదం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుసుకున్న సాయి పల్లవి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను ఓ డాక్టర్ అని, తనకు ప్రాణం విలువ తెలుసని, హింస ఎవరు చేసినా హింసే అని చెప్పడమే తన ఉద్దేశ్యమని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.


ఇక నయనతార సరోగసి వివాదం ఒక్కసారిగా తమిళనాట వైరల్ అయింది. పెళ్లి చేసుకున్న రెండు నెలల్లోపే ఇలా బిడ్డలను చూపించడంతో అంతా షాక్ అయ్యారు. అయితే సరోగసిని ఎప్పుడో చేయించుకున్నారని, అది చట్టబద్దమని, సరోగసి అమల్లోకి రాక ముందే వీరు ఈ ప్రాసెస్ ప్రారంభించారని, వీరికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయిందని ప్రభుత్వం నివేదికను సమర్పించింది. దాంతో నయన్ విఘ్నేశ్ సరోగసి వివాదం సద్దుమణిగింది. ఇక నయన్ తిరుమల మాఢవీధుల్లో చెప్పులతో నడవడం, అక్కడ ఫోటో షూట్లు చేయించుకోవడం కూడా కాంట్రవర్సీ అయింది.


లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అనసూయ వేసిన ట్వీట్ చిలికి చిలికి గాలివానలా మారింది. విజయ్ అభిమానులు, నెటిజన్లు అనసూయను ఆడుకున్నారు. ఇక ఆంటీ అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అనసూయ సైతం నెటిజన్లు ధీటుగా జవాబులు ఇస్తూ వచ్చింది. చివరకు తనను ఆంటీ అన్న వాళ్లందరి మీద కేసు వేస్తాను అని అనేసింది. దీంతో జనాలు మరింతగా రెచ్చిపోయారు. అనసూయ ఆంటీ అంటూ నేషనల్ వైడ్‌గా రెండ్రోజులు ట్రెండ్ చేశారు. అలా మొత్తానికి ఈ ఏడాది మాత్రం ఆంటీ అనే మ్యాటర్ ఎక్కువగా వైరల్ అయింది.


Also Read : RRR For Oscars : షార్ట్ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి ఆస్కార్ అవార్డు?


Also Read : BuchiBabu Remunerations : రెండో సినిమాకే అన్ని కోట్లా?.. నక్కతోక తొక్కిన బుచ్చిబాబు.. రామ్ చరణ్‌కు ఎన్ని కోట్లంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook