Nayanthara wedding: నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ !
నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఫిబ్రవరి 2న నయనతార తన బాయ్ ఫ్రెండ్, దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది సదరు మీడియా కథనాల సారాంశం.
నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఫిబ్రవరి 2న నయనతార తన బాయ్ ఫ్రెండ్, దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది సదరు మీడియా కథనాల సారాంశం. అంతకంటే ముందుగా తమిళనాడులోనే పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని.. ఆ తర్వాత నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి జరగనుందని తమిళ మీడియా కోడైకూస్తోంది.
నయనతార పెళ్లి వార్తలు వార్తల్లోకెక్కడం ఇదేం తొలిసారి కాదు. నయన్ పెళ్లి చేసుకోనున్నట్టు గతంలోనూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. నయనతార ప్రత్యేకత ఏంటంటే.. అప్పట్లో శింభుతో అయినా, ఆ తర్వాత ప్రభుదేవాతో అయినా, ఇక ఇప్పుడు విగ్నేష్ శివన్‌తో ( Vignesh Shivan ) అయినా.. బాయ్ ఫ్రెండ్స్‌తో రిలేషన్‌షిప్స్ దాచిపెట్టి సీక్రెట్‌గా ఉంచాలని తాను ఏనాడూ అనుకోలేదు. అలాగని మీడియా ముందు తన లవ్ స్టోరీల గురించి పెదవి విప్పడం కూడా జరగలేదు.
Also read : Tollwood: లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి సరసన నటించే నటి ఎవరో తెలుసా
నయనతార పెళ్లి గురించి ఈసారి సీరియస్ డిస్కషన్స్ జరుగుతుండటంతో.. ఆమె అభిమానులు సైతం నయన్ పెళ్లి వార్తలపై అంతే సీరియస్‌గా ఫోకస్ చేశారు. అంతేకాదు.. ఈసారి అయినా నయన్ పెళ్లి ( Nayanthara ) చేసుకుంటుందా లేక ఉత్తుత్తి వార్తలే అవుతాయా అని చెవులు కొరుక్కుంటున్నారు కూడా. ఏం జరగనుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Also read : Samantha's remuneration: సామ్ జామ్ షోకు సమంత పారితోషికం ఎంతో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook