Tollwood: లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి సరసన నటించే నటి ఎవరో తెలుసా

Tollwood: మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరి చిరంజీవి సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..అది తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవుతారు.

Last Updated : Jan 2, 2021, 03:27 PM IST
Tollwood: లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి సరసన నటించే నటి ఎవరో తెలుసా

Tollwood: మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరి చిరంజీవి సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..అది తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవుతారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ చిరు ( Megastar Chiru ) 152వ చిత్రం ఆచార్య ( Acharya ) తరువాత సినిమా ఏంటనేది అభిమానులకు ఆసక్తిగా మారింది. ఆచార్య షూటింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవితో మళయాలం బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ ( Malayalam blockbuster movie lucifer ) షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే లూసిఫర్ రీ‌మేక్‌ ( Lucifer remake )కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మోహన్‌లాల్‌గా చిరంజీవి నటిస్తుండగా..సత్యదేవ్ కీలకపాత్రలో కన్పించనున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా మరో వార్త వైరల్ అవుతోంది. దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా పేరున్న ఎవర్‌గ్రీన్ బ్యూటీ నయనతార...ప్రధాన పాత్రలో కన్పించనుందని సమాచారం. ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో నయనతార నటించనుందనే వార్త హల్‌చల్ చేస్తోంది. మళయాలంలో మంజు వారియర్ చేసిన హీరో సోదరి పాత్రకు నయనతార ( Nayanatara )ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాతలు నయనతారతో చర్చలు జరుపుతున్నారు. 

అభిమానులకు నిజంగా ఇది షాకింక్ విషయమే. సైరా సినిమాలో చిరంజీవి ( Chiranjeevi )తో జోడీగా కన్పించిన నయనతార ఇప్పుడు చిరుకు సోదరిగా నటించడాన్ని అభిమానులు జీర్ణించుకుంటారా లేదా అనేది చూడాలి. ఇంకా నయనతార కూడా దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి...రాయలసీమ బ్యాక్ గ్రౌండ్‌లో కధను మలిచారు. లూసిఫర్ స్థానంలో బైరెడ్డి టైటిల్‌ను ఆలోచిస్తున్నారు. లూసిఫర్ రీమేక్ తరువాత చిరంజీవి తమిళ చిత్రం వేదాళం రీమేక్ లో నటించనున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయిందట.

Also read: Chiru 153 : మెగా అభిమానులకు శుభవార్త.. లూసిఫర్ దర్శకుడు...

Trending News