Nayanthara - Vignesh Shivan blessed with twin boys: నయనతార అభిమానులకు ఆమె భర్త విగ్నేష్ శివన్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 9వ తేదీన చెన్నైకి సమీపంలోని మహాబలేశ్వరంలో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఏకంగా తాము తల్లిదండ్రులమయ్యామంటూ అధికారికంగా ప్రకటించారు. కేరళలో పుట్టి పెరిగిన నయనతార తర్వాత సినీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార చాలా రోజుల నుంచి ఆయనతో డేటింగ్ లో ఉంది,  ఈ ఏడాది జూన్ నెలలో వీరు తిరుమలలో వివాహం చేసుకోవాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాలతో మహాబలేశ్వరంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా తాము కవల పిల్లలకు జన్మనిచ్చినట్లుగా విగ్నేష్ శివన్, నయనతార సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాక ఆ ఇద్దరు బాలలకు సంబంధించిన కాళ్ల ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.


నయనతార సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆమె గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించింది. సత్యప్రియ అనే పాత్రలో సత్యదేవ్ భార్య పాత్రలో ఆమె కనిపించింది. గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె ఇటీవల ఆ సినిమాను హిట్ చేసినందుకు అభిమానులందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ కూడా చేసింది. ఇంతలోనే ఆమె తల్లి అయినట్లుగా అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.


ఇక ఇదే విషయాన్ని నయనతార కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇద్దరు అబ్బాయిలే పుట్టినట్టు పోస్ట్ చేసింది. ఇక నయనతార తల్లి అయిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే వీరి వివాహం జూన్ నెలలోనే జరగగా ఇంకా ఏడాది కూడా పూర్తికాకుండానే వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. అయితే సరోగసీ ద్వారా వీరు తల్లితండ్రులు అయినట్టు చెబుతున్నారు. అందుకే నయనతార సినిమాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. 



కొన్నాళ్ల క్రితం అలియా భట్ కూడా ఇలా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పుడే రకరకాల ప్రచారాలు జరిగాయి. అలియాభట్ వాటన్నింటినీ ఖండించింది. ఇప్పుడు నయనతార కూడా ఏడాదిలోపే కవల పిల్లలకు జన్మనివ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Chiranjeevi Old Video Viral: గరికపాటిది తప్పయితే మెగాస్టార్ ది కూడా తప్పేగా.. చిరు పాత వీడియో వైరల్!


Also Read: Dil Raju Temple: సొంత ఊరిలో దిల్ రాజు వెంకటేశ్వర స్వామి నిర్మాణం.. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook