Dil Raju Temple: సొంత ఊరిలో దిల్ రాజు వెంకటేశ్వర స్వామి నిర్మాణం.. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్!

Dil Raju Invited Media to Visit Venkateswara Swami Temple in his hometown: దిల్ రాజు తన స్వగ్రామంలో నిర్మించిన దేవాలయాన్ని సందర్శించడం కోసం మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 9, 2022, 05:57 PM IST
Dil Raju Temple: సొంత ఊరిలో దిల్ రాజు వెంకటేశ్వర స్వామి నిర్మాణం.. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్!

Dil Raju Invited Media to Visit Venkateswara Swami Temple in his hometown: వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమ మీద తనకు ఉన్న మక్కువతో ఎక్కడో మారుమూల నిజామాబాద్ జిల్లాలోని నరసింగపల్లి అనే గ్రామంలో పుట్టిన వెంకటరమణారెడ్డి హైదరాబాద్ వచ్చి తొలుత సినీ డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ప్రారంభించి దిల్ సినిమాతో నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. దిల్ రాజు మొదటి నుంచి తాను వెంకటేశ్వర స్వామికి వీరభక్తుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకు తగినట్లుగానే ఆయన తన బ్యానర్ కి కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే పేరును పెట్టుకుని దాని ద్వారా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మారినప్పటి నుంచి తన సొంత గ్రామం అయినా నరసింగపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్ణయం నిర్మించాలని దిల్ రాజు సంకల్పించారు.

సుమారు 2010వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. అయితే తాజాగా ఈ గుడిని సందర్శించడం కోసం హైదరాబాద్ నుంచి మీడియా ప్రతినిధులను ప్రత్యేక వాహనాల్లో తన సొంత గ్రామానికి తీసుకెళ్లి తాను నిర్మించిన గుడిని ఆయన అందరికీ చూపించారు. దిల్ రాజు నిర్మించిన గుడి అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లి చూసి వచ్చిన మీడియా ప్రతినిధులు కొందరు పేర్కొన్నారు.

ఇక దిల్ రాజు కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులలో లైన్లో పెట్టారు. అలాగే తన మొదటి భార్య అనిత చనిపోవడంతో కొన్నాళ్లపాటు బాధలో కూలిపోయిన ఆయన తర్వాత వైఘారెడ్డి అనే ఒక యువతీని వివాహం చేసుకోవడం, ఆమె ఇటీవల ఒక 12 మగ బిడ్డకు జన్మనివ్వడంతో దిల్ రాజు ఒకరకంగా వారసుడి ఆగమనంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.
Also Read: Chiranjeevi Old Video Viral: గరికపాటిది తప్పయితే మెగాస్టార్ ది కూడా తప్పేగా.. చిరు పాత వీడియో వైరల్!

Also Read: Old lady on Jr NTR: నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? ఎన్టీఆర్ పై వృద్ధురాలు షాకింగ్ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News