New Movies Updates: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొత్త సినిమాల సందడి పెరిగింది. గత కొన్నాళ్లుగా కొవిడ్ కారణంగా ఆగిపోయిన సినిమాలన్నీ.. వెంటవెంటనే విడుదలవుతున్నాయి. గత నెలాఖరున ప్రారంభమైన కొత్త సినిమాల సందడి.. గత వారం విడుదలైన.. రాధే శ్యామ్.. ఆర్​ఆర్​ఆర్​ ఇలా సాగుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ వారం కూడా కొత్త సినినమాలు థియేటర్లలో, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం.


మిషన్​ ఇంపాజిబుల్..


తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్​ ఇంపాజిబుల్​' సినిమా మూవీ ఏప్రిల్ 1న థియేటర్లో విడుదలకు సిద్ధమైంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా ఇది. ఇన్వెస్టిగేటివ్​ తాప్సీ జర్నలిస్ట్​గా నటించిన ఈ మూవీ నిరంతరం.. ఆసక్తికరంగా సాగుతుందని చిత్ర దర్శకుడు ఆర్​ఎస్​జే స్వరూప్​ తెలిపారు. ఈ మూవీకి నిరంజన్​ రెడ్డి, అన్వెష్​ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరించారు.


ప్రవీన్​ తాంబే ఎవరు?


ప్రముఖ క్రికెటర్ ప్రవీన్​ తాంబే జీవిత కథ ఆధారంగా.. తెరకెక్కిన 'ప్రవీన్ తాంబే ఎవరు?' అనే సినిమా నేరుగా డిస్నీ+ హాట్​స్టార్​లో విడుదలవనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ మూవీని స్ట్రీమ్ చేసేందుకు వీలుంది. హిందీలో తెరకెక్కిన ఊ మూవీ తెలుగు సహా పలు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్​ను చూడొచ్చు.


ఓటీటీలో రాధేశ్యామ్​..


ప్రభాస్​, పూజా హెగ్డేలు ప్రధాన పాత్రలో నటించిన.. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్​ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిక్స్​డ్​ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 1న అమెజాన్​ ప్రైమ్​లో విడుదలనుంది. ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్​ సాముద్రిక నిపుణుడిగా కనిపించారు. 1970-80ల కాలం నాటి లవ్​ స్టోరీగా ఈ మూవీని తెరకక్కించారు. వీజువల్​ వండర్​గా ఈ మూవీ మంచి గుర్తింపు లభించుకుంది.


ఆడవాళ్లు మీకు జోహార్లు


శర్వానంద్ హీరోగా.. రష్మిక మందాన్న హీరోయిన్​గా నటించిన మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇ్పుడు ఈ మూవీని ఓటీటీలో విడుదల కానుంది. సోనీలివ్​లో ఏప్రిల్ 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుంది.


హే సినామిక..


మలయాళం హీరో దుల్కర్​ సల్మాన్​ హీరోగా.. నటించిన హే సినామిక కూడా ఇటీవల థియేటర్లలో విడుదలై.. మిక్స్​డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో అతిథి రావ్​ హైదరీ, కాజల్​ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ.. నేరుగా జియో సినిమాలో మార్చి 31 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. నెట్​ ఫ్లిక్స్​లో కూడా ఈ మూవీని చూసేందుకు వీలుంది. మలయాళంలోనే కాకుండా.. తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో ఊ మూవీ అందుబాటులో ఉండనుంది.


హలో జూన్​..


మలయాళంలో సూపర్ హిట్​ అయిన సినిమాలను.. ఆహా ఓటిటీ ప్లాట్​ ఫామ్​ తెలుగులో డబ్బింగ్ వెర్షన్​లను విడుదల చేసి ఎంతో మందికి చేరువైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరిన్ని సినిమాలను చేస్తోంది. ఇందులో హలో జూన్ అనే చిత్రాన్ని ఏప్రిల్​ 1 నుంచి స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉంచనుంది ఆహా ఓటీటీ. మలయాళంలో ఈ మూవీ 2019లో విడుదలైంది.


Also read: Jana Gana Mana: జన గణ మన... విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్...


Also read: Video: లాంగ్ గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్‌లోకి సాయి ధరమ్ తేజ్... ఎమోషనల్ అయిన మెగా హీరో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook