Jana Gana Mana: జన గణ మన... విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్...

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా ఫిక్స్ అయింది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన' సినిమాను విజయ్‌ హీరోగా తెరకెక్కించనున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.
  • Mar 29, 2022, 15:44 PM IST

Vijay Deverakonda Puri Jagannadh 'Jana Gana Mana': సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా ఫిక్స్ అయింది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన' సినిమాను విజయ్‌ హీరోగా తెరకెక్కించనున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.

1 /5

'లైగర్' మూవీ విడుదలకు ముందే విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమాను ప్రకటించారు. పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన'ను విజయ్ దేవరకొండతో తెరకెక్కించనున్నట్లు అనౌన్స్ చేశారు.

2 /5

ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూరి జగన్నాథ్ ఈ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

3 /5

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సినిమాను ఆగస్టు 3, 2023న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

4 /5

ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వార్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా ఉండొచ్చునని చెబుతున్నారు. 

5 /5

'జన గణ మన' సినిమా అనౌన్స్ సందర్భంగా మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.