Hit 3 Movie: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరగగా.. సినీ పరిశ్రమలో మాత్రం తీవ్ర విషాదం నింపింది. సినిమా షూటింగ్‌లో ఉన్న మహిళా సినిమాటోగ్రాఫర్‌ హఠాన్మరణం పొందారు. ఛాతీ నొప్పికి గురయిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవగా.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె కన్నుమూసింది. ఈ సంఘటనతో కొత్త సంవత్సరం రోజు సినిమా పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ ఘటనతో నాని, అడివి శేష్‌ నటిస్తున్న 'హిట్‌ 3' చిత్రబృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. అర్ధాంతరంగా సినిమా షూటింగ్‌ను ఆపేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dil Raju: మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చాలా బాధాకరం.. దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు


భారీ హిట్ సొంతం చేసుకున్న 'హిట్‌' సినిమాకు సీక్వెల్‌గా 'హిట్‌ 3' చిత్రం తెరకెక్కిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. మంగళవారం షూటింగ్‌ జరుగుతుండగా కేరళకు చెందిన అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌ కేఆర్‌ కృష్ణ (36) అస్వస్థతకు గురయ్యారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న హిట్ 3 సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం


ఆమె అస్వస్థతకు గురి కాగా వెంటనే శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కేఆర్‌ కృష్ణ కన్నుమూశారని వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతితో చిత్రబృందంలో తీవ్ర విషాదం అలుముకుంది. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేసి ఆమెకు నివాళులర్పించారు. అనంతరం కృష్ణ స్వగ్రామమైన కేరళలోని పెరూంబావూరుకు మృతదేహాన్ని తరలించారు. ఆదివారం కృష్ణ అంత్యక్రియలు ముగిశాయని సమాచారం. అయితే ఆమె మృతితో నానితోపాటు అడివి శేష్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆమె మరణంతో తాత్కాలికంగా సినిమా షూటింగ్‌కు విరామం ప్రకటించినట్లు సమాచారం. ఆమె కుటుంబాన్ని చిత్రబృందం ఆదుకుంటుందని ప్రకటించినట్లు తెలుస్తోంది. హిట్‌ 3 సినిమా త్వరితగతిన పూర్తి చేసి ఈ వేసవికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కాగా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా కొత్త సంవత్సరం సందర్భంగా జీ తెలుగులో ప్రసారమైంది. దీనికి టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook