Dr Ram Charan: ఇకపై మామూలు రామ్ చరణ్ కాదు.. డాక్టర్ `రామ్ చరణ్` అని పిలవాలి
Vels University Announced Honorary Doctorate To Ram Charan: సినీ నటుడు రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇప్పుడు చెర్రీ సాధారణ హీరో కాదు డాక్టర్ రామ్ చరణ్‌గా పిలవాల్సి ఉంది.
Ram Charan: తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన మన హీరో రామ్ చరణ్‌కు మరో విశిష్ట గౌరవం దక్కింది. తన పేరుకు ముందు ఇకపై డాక్టర్ అని కనిపించనుంది. చెర్రీ డాక్టర్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయమేమిటంటే.. ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. త్వరలోనే చరణ్ ఆ డాక్టరేట్‌ను అందుకోనున్నాడు.
Also Read: Pithapuram: హైపర్ ఆది సంచలనం.. పవన్ కల్యాణ్ కోసం షూటింగ్‌లు, షోలకు గుడ్ బై
తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 13వ తేదీన జరుగనున్న విశ్వవిద్యాలయ స్నాత్సకోత్సవానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతూనే డాక్టరేట్ పొందనున్నాడు. కళా రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపునిస్తూ ఈ డాక్టరేట్ చరణ్‌కు అందిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ విచ్చేస్తుండడంతో విశ్వవిద్యాలయం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లు సినీ నిర్మాత, వేల్స్ యూనివర్సిటీ చాన్సలర్ ఈసరి గణేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలో చెర్రీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారామ్ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
Also Read: Mega Brothers One Frame: మెగా బ్రదర్స్ అరుదైన కలయిక.. 'విశ్వంభరుడే' కలిపాడా?
తమ హీరోకు డాక్టరేట్ ప్రకటించడంతో చెర్రీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామ్ చరణ్‌కు అనేక అవార్డులు లభిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అరుదైన గౌరవం లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్వదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం సాధారణ విషయం కాదు. గతంలో కొందరు తెలుగు నటులు ఇలాంటి గుర్తింపు పొందగా.. యువ హీరోల్లో మాత్రం బహుశా చెర్రీ మొదటి వాడు అయ్యిండవచ్చు.
ఈ విషయాలను పక్కనపెట్టి సినిమాల విషయానికి వస్తే.. చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్'తో బిజీగా ఉన్నాడు. ఎస్.శంకర్ దర్శకత్వంలో చెర్రీ, కియారా అద్వానీ జోడిగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చరణ్‌కు గుర్తింపు లభిస్తుందనే ధీమాతో చిత్రబృందం, చెర్రీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సనతో తదుపరి చిత్రం చేయనున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter