Pithapuram: హైపర్‌ ఆది సంచలనం.. పవన్‌ కల్యాణ్‌ కోసం షోలకు గుడ్‌ బై

Hyper Aadi Shooting Break For Pawank Kalyan Election Campaign: తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌ కోసం భారీ త్యాగం చేశాడు. సినిమాలే కాదు రాజకీయాలపరంగా కూడా పవన్‌ అండగా నిలుస్తూ తన షూటింగ్‌లు, షోలకు గుడ్‌ బై ప్రకటించాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 11, 2024, 06:49 PM IST
Pithapuram: హైపర్‌ ఆది సంచలనం.. పవన్‌ కల్యాణ్‌ కోసం షోలకు గుడ్‌ బై

Hyper Aadi: నటుడిగా పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమానం ఉన్న కమెడియన్‌ హైపర్‌ ఆది ఇప్పుడు రాజకీయాల్లో కూడా చూయిస్తున్నాడు. తన అభిమాన నటుడిని ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. పవన్‌ గెలుపు కోసం హైపర్‌ ఆది తన షోలు త్యాగం చేసినట్లు ప్రకటించాడు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎలాంటి షోలు చేయడం లేదని వెల్లడించాడు.

Also Read: Tamanna Simhadri: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తమన్నా

పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురం దక్కిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థిత్వం పిఠాపురంలో తీవ్ర రచ్చ రేపగా.. టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించింది. ప్రస్తుతానికి టీడీపీ శ్రేణుల్లో తాత్కాలికంగా అశాంతి చల్లారింది. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పవన్‌కు అండగా నిలిచేందుకు హైపర్‌ ఆది కదిలాడు.

Also Read: Janmat Polls: ఏపీ ఎన్నికలపై మరో సర్వే.. ఈసారి ప్రజలు పట్టం కట్టేది వారికే..

 

ఎన్నికల సమయం రావడంతో తన అభిమానాన్ని చూపించుకునేందుకు హైపర్‌ ఆది రంగంలోకి దిగాడు. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం చేపట్టాడు. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారం చేశాడు. మహిళలను కలిసి పవన్‌ కల్యాణ్‌కు ఓటేసి గెలిపించాలని కోరాడు. అంతకుముందు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించాడు.

ఈ సందర్భంగా హైపర్‌ ఆది మాట్లాడుతూ.. 'లక్ష మెజార్టీతో పవన్‌ కల్యాణ్‌ గెలుస్తాడు' అని ధీమా వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ గెలిస్తే పిఠాపురానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్‌ను చూసేందుకు ఎలా వెళ్తున్నారో.. పవన్‌ గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా ప్రపంచంలోని తెలుగు వారు చూసేందుకు వస్తారు' అని తెలిపాడు. ఇక ప్రచారం విషయమై మాట్లాడుతూ.. 'నాగబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నా. రానున్న నెల రోజులు షూటింగులకు వెళ్లకుండా జనసేన పార్టీ ప్రచారంలోనే ఉంటా. ప్రచారం కోసం షూటింగ్‌లు, షోలు ముందే పూర్తి చేసుకుని వచ్చా' అని ఆది వివరించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x