రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చాట్ తరువాత ఇప్పడు మహేష్ భట్... జియా ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ( Viral Video ) అవుతోంది. నిజానికి రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య సాగిన చాటింగ్ కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అయిన తరువాత  వీరిద్దరు కలిసి సుశాంత్ కు ఏకాంతం మిగిల్చారు అని తెలిసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) జూన్ 14వ తేదీన ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు.



అంతకు ముందు జూన్ 8న రియా చక్రవర్తి సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ రిలేషన్ వల్ల ఇద్దరూ సంతోషంగా లేము అని సుశాంత్ చెప్పడం వల్ల రియా ఇలా వెళ్లిపోయింది అని ఒక వార్త కూడా వచ్చింది. నిజానికి రియా చక్రవర్తి, మహేష్ భట్ ( Mahesh Bhatt ) మధ్య సాగిన చాటింగ్ కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అయిన తరువాత  వీరిద్దరు కలిసి సుశాంత్ కు ఏకాంతం మిగిల్చారు అని తెలిసింది.


ఇవి కూడా చదవండి



కానీ ప్రస్తుతం మహేష్ భట్ కు చెంది మరో వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతోంది. దివంతగ బాలీవుడ్ నటి జియా ఖాన్ ఇందులో కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి జియా ఖాన్ మహేష్ భట్ మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది అనేది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతోంది. ఈ వీడియోలో మహేష్ భట్ జియా ఖాన్ ను హగ్ చేసుకుని.. ఆమె చేతులను పట్టుకున్నాడు. ఈ వీడియో చూసి నెటిజెన్స్ మహేష్ భట్ ను ట్రోల్ చేస్తున్నారు.


సుశాంత్ కేసు సిబిఐ దగ్గరికి వెళ్లడానికి ముందు జియా ఖాన్ ( Jia Khan ) తల్లి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.