Mega hero in God Father: చిరంజీవి కాకుండా గాడ్ ఫాదర్ లో మరో మెగా హీరో.. ఏ పాత్రలో నటించాడో తెలుసా?
One More Mega hero in God Father other than Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కాకుండా మీరో మెగా హీరో కూడా నటించారు. అతనెవరో తెలుసుకుందామా?
One More Mega hero in God Father other than Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా అద్భుతంగా ఉందని మెగా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేస్తున్నారు. మేము హిట్టు కొట్టేశాము అంటూ వారంతా ఒక రకమైన పండగ వాతావరణంలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది.
మలయాళంలో టోవినో థామస్ నటించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటించే అవకాశం ఉందని సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు లీకులు బయటికి వచ్చాయి. అయితే నిజానికి ఒరిజినల్ వర్షన్లోలా పవన్ కళ్యాణ్ పోషిస్తారని ప్రచారం చేసిన పాత్ర లేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కాకుండా మరో మెగా హీరో కూడా నటించాడు. అయితే మెగా హీరోకి పెద్దగా గుర్తింపు లేదు ఆయన ఎవరంటే కొణిదెల పవన్ తేజ్.
మెగాస్టార్ చిరంజీవికి కాస్త దూరపు బంధువు అయిన పవన్ తేజ్ ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కాలం కలిసి రాకపోవడంతో మెగా హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. అయినా హీరోగా లాంచ్ అయ్యాడు కాబట్టి అతనిని మెగా హీరో గానే అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన మూడు నాలుగు సీన్లలో కనిపించాడు. ఆయన సినిమాలో ఒక గిరిజన వ్యక్తి పాత్రలో కనిపిస్తాడు.
ఓ కీలకమైన ఫైట్ సీక్వెన్స్ లో కూడా పవన్ తేజ్ కనిపిస్తాడు. పవన్ తేజ్ గతంలో ఆచార్య సినిమాలో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ లో కనిపిస్తాడు. మెగాస్టార్ చిరంజీవి చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తిగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో మాత్రం సుమారు నాలుగు ఐదు సీన్లలో కనిపించే అవకాశం పవన్ తేజ్ కి దక్కింది. పవన్ తేజ్ ఇటీవలే మేఘన అనే యాంకర్ ను వివాహం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. వీరిద్దరూ కలిసి తమ మొదటి సినిమాలో హీరో హీరోయిన్గా నటించారు. తరువాత మేఘన ఈ టీవీలో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండగా పవన్ తేజ్ మాత్రం తమ మెగా హీరోల సినిమాల్లో ఏదో ఒక పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
Also Read: Lucifer Vs God Father : లూసిఫర్లో అక్కడెవరు, గాడ్ ఫాదర్లో ఇక్కడెవరు? - ఫుల్ డీటెయిల్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook