Oscar 2023: దేశం గర్వించే విధంగా రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ది ఎలిఫెంట్ విస్పరర్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటలు అవార్డులు గెల్చుకున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్‌కు మోదీ శుభాకాంక్షలు


దేశం తొలిసారిగా ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ బృదానికి, తమిళ సినిమా ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సాధించిందని..ఏళ్ల తరబడి ఆ పాట గుర్తుండిపోతుందని తెలిపారు. దేశం ఖ్యాతి ఇనుమడించేలా చేసినందుకు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ , ఆర్ఆర్ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు అందించారు. మరోవైపు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగరీలో ఆస్కార్ దక్కించుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్‌కు, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 


కేసీఆర్ శుభాకాంక్షలు


విశ్వ సినీ యవనికపై ఓ తెలుగు సినిమా ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు లభించడం తెలుగువారిగా గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాటు నాటు పాటలో పొందుపర్చిన పదాలు, తెలంగాణ సంస్కృతి, తెలుగు ప్రజల అభిరుచికి, ప్రజా జీవన వైవిద్యానికి అద్దం పట్టాయన్నారు. నాటు నాటు పాటకు సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్‌ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.


వైఎస్ జగన్ అభినందనలు


తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఒరిజినల్ సాంగ్ కేటగరీలో నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకోవడం సంతోషమని తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించిందని..ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిందన్నారు. అంతర్జాతీయంగా తెలుగు పతాకాన్ని రెపరెపలాడించిందన్నారు. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చిందన్నారు వైఎస్ జగన్.


Also read: Oscars 2023: ఇండియాకు తొలి ఆస్కార్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook